పాకిస్తాన్ లో అతను గెలవాలకున్న భారత గ్రామం!

Saturday, July 28th, 2018, 01:10:15 AM IST

పాకిస్తాన్‌ పార్లమెంట్‌ ఎన్నికలు మొత్తానికి వివాదస్పదంగానే ముగిశాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రచారాలు జరిగాయి. ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్న వారు కూడా ఈ సారి రాజకీయాల్లో ప్రచారాలను నిర్వహించారు. ఆ విషయం పక్కనపెడితే ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పై చేయి సాధించిన సంగతి తెలిసిందే. అయిత్ నవాజ్‌ షరీఫ్‌ పార్టీ విజయం సాధించాలని భారత ప్రభుత్వం కోరుకుందని ఇటీవల ఇమ్రాన్ ఖాన్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

ఆ విషయం గురించి ఎలాంటి నిజం లేదని అందరికి తెలిసిందే అయినా భారతదేశంలోని ఒక గ్రామం మాత్రం నవాజ్ షరీఫ్ పార్టీ గెలవాలని చాలా బలంగా కోరుకుంది. పంజాబ్‌ రాష్ట్రంలోని టార్న్‌ తరణ్‌ జిల్లా, జటి ఉమ్రా గ్రామం వాసులు నవాజ్ గెలవాలని మళ్లీ ప్రధానిగా ఉండాలని ప్రార్ధనలు చేశారు. ఎందుకంటే నవాజ్‌ షరీఫ్‌ పూర్వీకులు ఈ గ్రామానికి చెందినవారే. దేశం విడిపోకముందు షరీఫ్ సొంత గ్రామం నుంచి పాకిస్తాన్ కు వెళ్ళిపోయాడు. దీంతో అతని ఇల్లు ఇప్పుడు గురుద్వార్ గా మారింది. వారి సొంత ఇంటి ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి. అలాగే నవాజ్ తాత మియాన్‌ ముహమ్మద్‌ బక్ష్‌ సమాధి ఇంకా ఆ గ్రామంలో ఉంది.

ఇకపోతే సొంత ఉరిపై ప్రేమతో నవాజ్ షరీఫ్ సోదరుడు 2013లో ఈ గ్రామాన్ని సందర్శించాడు. ఆయనతో పాటు పాక్‌ పంజాబ్‌ రాష్ట్రం ముఖ్యమంత్రి షాహ్బాజ్‌ షరీఫ్‌ కూడా వచ్చి గ్రామాన్ని చూసి అభివృద్ధి కార్యక్రమాల చేపట్టాలని అన్నారు. అప్పటి భారత పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌కు విజ్ఞప్తి చేయగా ఆయన విద్యుత్ సరఫరా వంటి పనులు మొదలు పెట్టడంతో అప్పట్లో వివాదాస్పదంగా మారింది.

అయినా కూడా తరువాత కొన్ని రోడ్లు అలాగే డ్రైనేజి వ్యవస్థను ఏర్పాటు చేశారు. మినీ స్టేడియం తో పాటు నైట్ షెల్టర్ 25 మంది యువకులకు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పించారు. అనంతరం గ్రామాన్ని పట్టించుకోవడం మానేశారు. రోడ్లు డ్రైనేజి వ్యవస్థ అన్ని దెబ్బ తిన్నాయి. మరమ్మత్తుల విషయంలో ఎవరు ముందడుగు వేయలేదు. ఇకపోతే ఇప్పుడు నవాబ్ షరీఫ్ గెలిస్తే మళ్లీ గ్రామానికి వస్తారని అంతా భావించారు. కానీ ఉహించని విధంగా అతని పార్టీ ఓటమి చెందింది.

  •  
  •  
  •  
  •  

Comments