బ్రేకింగ్ న్యూస్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఆరంభం అదిరింది..స్వర్ణపతాకం గెలిచింది

Friday, April 6th, 2018, 03:28:26 AM IST

ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఆరంభం అదిరింది. క్రీడలు ప్రారంభమైన తొలి రోజే మహిళల 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఫైనల్లో భారత అమ్మాయి సాయిఖోమ్ మీరాభాయ్ చాను స్వర్ణం గెలుచుకుంది విజయ పతాకం ఎగరవేసేంది. భారత తరఫున 2018 క్రీడల్లో పాల్గొని తొలి స్వర్ణం నెగ్గిన అమ్మాయిగా రికార్డు సృష్టించింది. అద్భుత ప్రదర్శన చేసిన చానుకు దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

23ఏళ్ల చాను భారత రైల్వేలో సీనియర్ టికెట్ చెకర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 194 కేజీలను ఎత్తి జాతీయ రికార్డును నెలకొల్పి స్వర్ణం గెలుచుకొని కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించింది. 22ఏళ్ల అనంతరం కరణం మల్లీశ్వరీ తరువాత ఈ ఘనత సాధించిన రెండో భారత అమ్మాయి చానునే కావడం విశేషం. అంత‌కుముందు పురుషుల 56 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో గురురాజా రజతం సొంతం చేసుకున్నాడు. భార‌త్‌కు తొలి ప‌త‌కం సాధించాడు. ఇకముందు ఆడబోవు ఆటగాళ్లకు కూడా మీరాభాయ్ ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచింది.