2019లో కూడా ప్రధాని మోడీనే అంటున్న సర్వేలు

Friday, January 27th, 2017, 08:30:03 PM IST

modi123
ఇండియా టుడే, అధ్యయన సంస్థ కార్వేలు సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వేలో కొన్ని ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని మోడీ దేశ ప్రజల దృష్టిలో వ్యతిరేకత మూటగట్టుకున్నారని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసాయి. అయితే ఇప్పుడు చేసిన సర్వే లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి 360 లోక్ సభ స్థానాలు వస్తాయని తెలిపింది. పాకిస్థాన్ ఫై భారత్ జరిపిన సర్జికల్ దాడులను, పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా మూడింట రెండొంతుల మంది సమర్ధించారు. ఈ సర్వేలో ఎంపిక చేసుకున్న శాంపిల్ సంఖ్యా తక్కువగా ఉంది. 12,143 మందిని ఎంపిక చేసుకుని ఇంటర్వ్యూ చేశారు.

దేశంలోని 97 పార్లమెంట్ స్థానాలు, 194 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 53 శాతం గ్రామీణ, 47 శాతం పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రజలను ఎంపిక చేయడం ద్వారా ఈ సర్వేను శాస్త్రీయంగా నిర్వహించామని ఇండియా టుడే, కార్వే లు చెప్పాయి. ఇండియా టుడే గతంలో నిర్వహించిన సర్వేల కన్నా ప్రధాని మోడీకి వ్యక్తిగత పాయింట్లు 15 శాతం పెరిగాయయి. ప్రధాని మోడీ చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ స్కీమ్ ను ఎక్కువ మంది సమర్ధించారు. దీనికి 27 శాతం మంది ఓటేశారు. డిజిటల్ ఇండియాకు 12 శాతం మంది, జనధన్ యోజనకు 16 శాతం మంది ఓటేశారు. పాకిస్థాన్ తో సంబంధాల విషయంలో మోడీ ప్రభుత్వం సవ్యంగా ప్రవర్తించిందని 62 శాతం మంది ఓటేశారు. నోట్ల రద్దు విషయంలో ఆర్బీఐ ప్రతిష్ట దెబ్బతిన్నదని 53 శాతం మంది అభిప్రాయపడగా, నోట్ల రద్దు విషయంలో గందరగోళం నెలకొందని 55 శాతం మంది అభిప్రాయ పడ్డారు.

శీతాకాల సమావేశాలు జరగకుండా బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీలు అడ్డుపడ్డాయని 18 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రధానిగా రాహుల్ గాంధీ సరైన వ్యక్తని 28 శాతం మంది అభిప్రాయపడగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అయితే ప్రధాన మంత్రిగా సరైన నాయకుడని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.