ఎన్నో ఏళ్లనాటి కల: నెరవేరిన భారత్ చిరకాల స్వప్నం..!

Monday, January 7th, 2019, 12:49:11 PM IST

Image Courtesy: BCCI Twitter

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బార్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియాపై 2 – 1తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది భారత్, ఆస్ట్రేలియాలో ఇదే భారత్ కు తోలి టెస్ట్ సిరీస్ విజయం. సిడ్నీలో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. ఆ సమయానికి ఆస్ట్రేలియా ఇంకా 316పరుగులు వెనుకబడి ఉండటంతో మ్యాచ్ ని డ్రా గా ప్రకటించారు. ఈ మ్యాచ్ తోలి ఇన్నింగ్స్ లో భారత్ 622పరుగుల భారీ స్కోర్ ను ఆస్ట్రేలియా ముందు ఉంచింది. భారత్ డిక్లేర్ చేయగా బరిలో దిగిన ఆస్ట్రేలియా, భారత బౌలర్ల ధాటికి నిలువలేకపోయి ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. కాగా ఇది హోమ్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడాల్సి రావటం గత 30ఏళ్లలో ఇదే తోలి సారి కావటం విశేషం. 1947 – 48లో ఆస్ట్రేలియాలో ఆడటం మొదలు పెట్టినప్పటినుండి అక్కడ భారత్ టెస్ట్ సిరీస్ ను గెలవటం ఇదే తొలిసారి, దీంతో భారత్ 70ఏళ్ళ కల నెరవేర్చడంటూ ఇటు అభిమానులు, అటు సీనియర్ క్రికెటర్లు కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ చారిత్రాత్మక విజయంతో ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ విజయం సాధించిన తోలి భారత కెప్టెన్ గా ఘనత సాధించాడు కోహ్లీ. కాగా ఈ సిరీస్ మొత్తం గణాంకాలు చుస్తే బ్యాటింగ్ లో పుజారా 521 పరుగులతో అగ్రస్థానంలో నిలువగా బౌలింగ్ లో బుమ్రా 21 వికెట్లు తీసి తోలి స్థానంలో ఉన్నారు.

ఈ సిరీస్ లో ఎవరెవరు ఎలా ఆడారు అన్న వివరాలు ఇలా ఉన్నాయి:

బ్యాట్స్ మెన్ రన్స్ యావరేజ్
ఛతేశ్వర్ పుజారా 521 74.42
రిషబ్ పంత్ 350 58.33
విరాట్ కోహ్లీ 282 40.28
మార్కస్ హర్రీస్ 258  36.85
ట్రావిస్ హెడ్ 237 33.85
అజింక్య రెహానే  217 31.00
ఉస్మాన్ ఖ్వాజా  198 28.28
మయాంక్ అగర్వాల్  195 65.00

 

బౌలర్ వికెట్స్ యావరేజ్
జస్ప్రిట్ బుమ్రా 21 17.00
నాథన్ లియాన్ 21 30.42
మహమ్మద్ షమీ 16 26.18
పాట్ కుమ్మిన్స్ 14 27.78
జోష్ హాజిల్ వుడ్ 13 30.61
మిచెల్ స్టార్క్ 13 34.53
ఇషాంత్ శర్మ 11 23.81