యోగా టీచర్ గా మారిన మోదీ..!

Sunday, March 25th, 2018, 06:20:31 PM IST

భారత దేశ ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత జీవితంలో యోగాకు ఎంతటి ప్రాధాన్యమిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన దేశం గురించి ఎంత శ్రద్ద తీస్కుంటారో అలాగే ఆరోగ్యం గురించి కూడా అలాగే శ్రద్ధ తీస్కుంటారు. అయితే ప్రతీ పౌరుడు నిత్యజీవితంలో యోగా చేయడం అలవాటు చేసుకోవాలని పిలుపునిస్తూ ప్రధాని మోదీ యోగా టీచర్‌గా మారారు. మన్ కీ బాత్ 42వ ఎడిషన్‌లో భాగంగా ప్రధాని మోదీ త్రికోణాసన (యోగాసనం) చేస్తున్న త్రీడీ యానిమేషన్ వీడియోను విడుదల చేశారు.

మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇవాళ ప్రధాని మోదీ మాట్లాడుతూ..తాను యోగా టీచర్‌ను కాదని..కానీ ప్రజలు సృజనాత్మకతతో తనను యోగా టీచర్‌గా మార్చారని అన్నారు. నాకు సంబంధించి రూపొందించిన యోగా త్రీడీ వెర్షన్ వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నానని ప్రధాని తెలిపారు. కానీ నన్ను అడ్డం పెట్టుకొని ప్రజలకు యోగా చేయాలంటూ ఒక మంచి పని చేస్తున్న ఆ యానిమేటర్లకు ప్రత్యెక కృతఙ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ.

Click here to Reply, Reply to all, or Forward