4 రోజుల ఇండిగో ఎయిర్‌లైన్స్ అఫర్.. రూ.1,212కే విమాన ప్రయాణం!

Tuesday, July 10th, 2018, 03:55:25 PM IST

ప్రస్తుత రోజుల్లో విమాన ప్రయాణాల చార్జీలు కూడా సామాన్యుడికి తగ్గట్టుగానే మారుతున్నాయి. దానికి తోడు కొన్ని సంస్థలు తక్కువ ధరకే టికెట్లపై ఆఫర్స్ ప్రకటిస్తుండడంతో జనాలు మక్కువ చూపుతున్నారు. ఇక ఇటీవల ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా భారీ ఆఫర్‌ ప్రకటించింది. తమ సంస్థ ద్వారా ప్రయాణించాలని అనుకునేవారికి తక్కువ ధరలో 12 లక్షల సీట్లను అందిస్తున్నట్లు ప్రకటించారు.

ఇండిగో ఎయిర్‌లైన్స్ 12వ వార్షికోత్సవం సందర్భంగా నాలుగు రోజులు కంటిన్యూగా ఈ అఫర్ ఉంటుంది. ఈ నెల 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 వరకూ ప్రయాణం చేసేవారు ఈ రోజు నుంచి జులై 13 వరకు బుక్కింగ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఈ నాలుగు రోజుల్లో టికెట్స్ కొనుగోలు చేసేవారికి టిక్కెట్ల ప్రారంభ ధర రూ.1,212గా ఉంటుంది. దేశ విదేశాల్లో ప్రయాణాల బట్టి రేట్లను కొంత వరకు తగ్గిస్తారు. అదే విధంగా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో బుకింగ్ చేసుకునేవారికి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటనలో తెలిపింది.