40 శాతం టాక్స్ చెల్లిస్తే వ‌దిలేస్తారు!

Friday, September 23rd, 2016, 01:58:36 PM IST

bank
బ‌హ‌మాస్ లీకేజీ .. తాజా సంచ‌ల‌న‌మిది. ల‌క్ష‌ల కంపెనీల లోగుట్ట బైటికొచ్చేసింది. ఇందులో 25 కంపెనీలు పైగానే తెలుగువారి కంపెనీలున్నాయి. ఒకే అడ్రెస్ నుంచి పాతిక కంపెనీలు బ‌హ‌మాస్‌లో సూట్‌కేస్ కంపెనీలు పెట్టుకున్న‌ట్టు తీగ క‌దిలించారు. ఇక డొంకంతా క‌దిలిపోవ‌డం ఖాయం. అస‌లైన కౌంట్‌డౌన్ స్టార్ట‌యిన‌ట్టే. న‌ల్ల‌డ‌బ్బును య‌థేచ్ఛ‌గా విదేశాల‌కు త‌ర‌లించి అట్నుంచి మ‌ళ్లీ వైట్‌గా తెచ్చుకోవ‌డం అన్న గేమ్ బైట‌ప‌డిన‌ట్టే. అయితే బ‌హ‌మాస్ లోనే ఇలా దొంగ డ‌బ్బు నిల్వ చేసుకుని అవ‌స‌రానికి స్వ‌దేశంలో వాడుకోవ‌డం అనాదిగా న‌డుస్తున్న‌దే అయినా ఇప్ప‌టి లీకేజీతో గుట్టు ర‌ట్ట‌య్యింది. అయితే ఈ న‌ల్ల కుబేరులంతా బైట‌ప‌డాలంటే ఏం చేయాలి? అందుకు కేంద్ర‌మే ఓ ఐడియా ఇచ్చింది.

న‌ల్ల‌కుబేరులు కంపెనీలు పెట్టుకుంటే స‌రే.. అందులో 40 శాతం టాక్స్ చెల్లిస్తే ఆ కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టినా చ‌ర్య‌లు ఉండ‌వ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. అయితే ఓపెన్‌గా వ‌చ్చి స‌ద‌రు న‌ల్ల కుబేరులు త‌మంత‌ట తాముగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ముందు త‌మ‌కుతాముగా పేర్లు బైట‌పెట్టాలి. త‌ర్వాత ప‌న్ను చెల్లించాలి. అప్పుడు ఆటోమెటిగ్గా అవ‌న్నీ ప‌బ్లిక్ కంపెనీల‌వుతాయి.