చిన్నారి ఆకలి- పురుగుల మందుతో కడుపు నింపుకున్న దౌర్బాగ్యం

Wednesday, January 9th, 2019, 04:00:42 PM IST

మన రాజకీయ నాయకులు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తున్నామని, మంచి పనుల్లో మమ్మల్ని మించిన నేతలు మీకు దొరకరని చాలా గొప్పలకు పోతుంటారు… కానీ వారి మాటలు, గొప్పలు కేవలం ఒక చిన్నారి ఆకలిని తీర్చలేకపోయాయి. మన దేశం యొక్క దౌర్భాగ్య పరిస్థితికి మల్లి మన కళ్ల ముందు కనిపించేలా చేసింది ఈ సంఘటన. ఎన్ని గొప్పలు చేస్తే ఏంటి ఒక చిన్న పిల్లవాడి ఆకలి తీర్చలేనప్పుడు ఇన్ని రాజకీయ పార్టీలు ఎందుకు, ఇందరు నాయకులూ ఎందుకు… కనీసం మన నాయకులు పేదరికం లో ఉన్న వారిని పట్టించుకోవడం లేదు. మన దేశంలో ఎంతో మంది కఠిక పేదరికంతో బతుకీడుస్తున్నవారిని పట్టించుకున్న పాపాన పోరు. కనీస వసతుల మాట అటుంచితే తినడానికి గుక్కెడు మెతుకులు కూడా అందించలేని పరిస్థితి మన రాజకీయ నాయకులది.

ఈ హృదయ విదారక సంఘటన మధ్యప్రదేశ్‌లోని రట్లం జిల్లాలో జరిగింది. అందులో గ్రామనికి చెందిన 10 ఏళ్ల చిన్నారి ఆకలికి తట్టుకోలేక, ఇంట్లో ఉన్న పొలానికి సంబందించిన విషపూరిత పురుగుల మందు తాగాడు. ఒక్కసారిగా అస్వస్తతకి గురైన చిన్నారిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్, చిన్నారికి మరింత మెరుగైన వైద్యం అందించాలని అదికారులను, ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించింది. చిన్నారి తల్లిదండ్రులు రాజస్థాన్ లోని కోటాలో పని చేయడానికి వెళ్ళారు. ప్రతినెలా వచ్చే రేషన్ సరుకులతో కడుపు నింపుకుంటామని, అవి పూర్తిగా అయిపోవడంతో ఆకలికి తట్టుకోలేక పురుగుల మందులు తాగాడని, చిన్నారి తండ్రి వాపోయాడు. ‘‘మా ఇంట్లో రేషన్ సరుకులు లేవు. కానీ, పరిపాలన యంత్రాంగం ఇట్లాంటి విషయాల్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది’’ అని తెలిపారు.