కంప్యూటర్ వైరుతో బిగించి ఇన్ఫోసిస్ ఉద్యోగిని దారుణ హత్య

Monday, January 30th, 2017, 10:32:25 AM IST

untitled-7
ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది. పుణెలోని రాజీవ్ మహాత్మా గాంధీ ఇన్ఫోటెక్ పార్క్ కార్యాలయంలో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈమెను కేరళకు చెందిన ఆనంద్ కే రాసిలా రాజు (25) గా గుర్తించారు. ఇన్ఫోసిస్ భవనం తొమ్మిదవ అంతస్తులో విధి నిర్వహణలో ఉన్న ఆమెను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గొంతు నులిమి హత్య చేశారు. ఆమె బెంగుళూరు లోని టీం తో ఆన్ లైన్ లో వర్క్ చేసుకుంటుండగా గుర్తు తెలియని దుండగుడు ఆమెను కంప్యూటర్ వైరుతో గొంతు బిగించి హత్య చేసాడు.

పోలీసులు చెప్పిన దాని ప్రకారం… రాజు ఆదివారం కార్యాలయంలో పని చేసుకుంటుందని, టీమ్ మేనేజర్ ఆమెకు కాల్ చేసినప్పుడు ఆమె కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే సెక్యూరిటీ గార్డ్ ను అప్రమత్తం చేసాడని, వెంటనే సెక్యూరిటీ గార్డ్ వెళ్లి చెక్ చేయగా ఆమె అపస్మారక స్థితిలో పడి ఉన్నట్టు గుర్తించారు. ఆదివారం సాయంత్రం సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా పోలీసులు సెక్యూరిటీ గార్డ్ ని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.