హెచ్ 1బి వీసాల బదులు ఈబీ-5 కు కంపెనీల మొగ్గు ?

Tuesday, January 30th, 2018, 12:36:52 PM IST

అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఆ పదవి చేపట్టాక వీసాల నిబంధలను కఠినతరం చేసిన విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా హెచ్ 1బి వీసాల మీద అక్కడికి వెళ్లే ఉద్యోగార్ధులకు ఇది పెద్ద సమస్య గా పరిణమించింది. వాస్తవానికి మన భారత్ టెక్ కంపెనీల వ్యాపారానికి హెచ్ 1బి వర్క్ వీసాలు ఒకరకంగా ప్రాణవాయువు గానే చెప్పుకోవాలి. ఆ కంపెనీలు చేసే విదేశీ వ్యాపారంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయి. అయితే ట్రంప్ విధానాల వల్ల మన టెక్ కంపెనీల లాభదాయకత పై తీవ్ర ప్రభావం పడింది. అమెరికాలో వినియోగదారులకు సేవలు అందించడం ఒకరకంగా ఖర్చుతో కూడుకున్న పనే, అయితే దీనికి ప్రత్యామ్నాయంగా అమెరికా లో పెట్టుబడులు వచ్చేలా కోత్తరకమైన ఈబీ-5 వీసాలను ఇవ్వాలని భావిస్తున్నారు. మన దేశంలో అగ్ర సంస్థలైన ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో వంటి వి ఈబీ-5 వీసాలకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పద్ధతి ద్వారా భరతదేశం లోని కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్ లు అమెరికా వెళ్లి అక్కడ ఉండవచ్చు. అసలు ఈబీ-5 అంటే అమెరికా కు వలస వచ్చేవారికి శాశ్వత నివాసం కల్పించడమే. అయితే అక్కడికి వెళ్ళేటపుడు 5 లక్షల డాలర్లు పెట్టుబడిగా తీసుకురావాలి అంటే అది మన కరెన్సీ ప్రకారం 3 కోట్లు. ఆ డబ్బుతో ప్రాజెక్ట్ పెట్టి దాని ద్వారా 10 ఉద్యోగాలు సృష్టించాలి. కన్సల్టెన్సీ లు కూడా భారతీయ కంపెనీలు ఎంపిక చేసిన ఉద్యోగులను ఈ ఈబీ-5 వీసాల క్రింద అక్కడికి పంపించే విధంగా ప్రోత్సహిస్తున్నాయి. అసలు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ల కోసం మల్టి నేషనల్ మేనేజర్, స్పాన్సర్ గ్రీన్ కార్డు, ఎల్1ఏ వీసాలను ఇప్పటివరకు వినియోగించేవారు. అయితే ఈ పూర్తి అంశాన్ని బయటకి చెప్పటానికి ఇష్టపడని కంపెనీలు తొలుత ఒక 5 మంది ఉద్యోగులను ప్రయోగాత్మకంగా ఈ వీసా క్రింద పంపి పరిశీలించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అవసరమైన మార్పులు చేర్పులు చేయవచ్చనే భవనలో ఉన్నట్లు తెలియవస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ ఈబీ-5 వీసాల పై దృష్టిపెట్టని అమెరికా ఈ వీసాలకు అనుమతించే పెట్టుబడుల మొత్తాన్ని మాత్రం 5 లక్షల నుండి 9 లక్షల 20 వేల డాలర్లకు పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు చెపుతున్నారు. ఇప్పటివరకు ఈ ఈబీ-5 వీసాల క్రింద అక్కడికి వెళ్లిన వారు రెస్టారెంట్లు, స్టార్టుప్ లు, ఆసుపత్రులు నిర్మాణం , రియల్ ఎస్టేట్ లలో పెట్టునాదులు పెట్టినట్లు తెలుస్తోంది. హెచ్ 1బి వీసాల మీద అమెరికా వెళ్లిన వారు అక్కడ వినియోగదారుల వద్ద ఉండి సేవలందించేవారు. కానీ ఈ సవరించిన వీసా నియమాల వల్ల బాగా నైపుణ్యం కల వారు మాత్రమే అక్కడికి వెళ్లగలరు. అందునా వారికి ఇచ్చే వేతనం కూడా అక్కడి చట్టాలను బట్టి ఎక్కువగా ఉండడంతో కంపనీల కు బాగా భారంగా మారింది. అయితే ఈ ఈబీ-5 వీసా ప్రత్యామ్నాయం మన కంపెనీలకు ఎంతవరకు లాభదాయకత చేకూరుస్తుందనేది తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడక తప్పదని నిపుణులు అంటున్నారు….