ఇంటెల్ కోర్ 8th జనరేషన్ ప్రాసెసర్లు వచ్చేసాయ్…

Tuesday, April 3rd, 2018, 11:05:53 PM IST

ప్రముఖ మథర్ బోర్డ్ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ తన 8వ జనరేషన్ కోర్ ప్రాసెసర్లను బీజింగ్‌లో జరిగిన తాజా ఈవెంట్‌లో విడుదల చేసింది. 8వ జనరేషన్ కోర్ ఐ5, ఐ7 ప్రాసెసర్లను ఇంటెల్ ఆవిష్కరించింది. అలాగే ల్యాప్‌టాప్‌ల కోసం ప్రత్యేకంగా 8వ జనరేషన్ కోర్ ఐ9 ప్రాసెసర్‌ను ఇంటెల్ లాంచ్ చేసింది. ఈ ప్రాసెసర్లను గేమింగ్, గ్రాఫిక్స్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని తయారు చేసినట్లు ఇంటెల్ వెల్లడించింది.

ఇంటెల్ విడుదల చేసిన 8వ జనరేషన్ ప్రాసెసర్లను డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్ పీసీల్లో ఉపయోగించనున్నారు. వీటి వల్ల ఆయా డివైస్‌లు మరింత వేగంగా పనిచేయడమే కాదు, ఓవరాల్‌గా అత్యుత్తమ ప్రదర్శనను ఇస్తాయి. గతంలో విడుదలైన ఇంటెల్ 7వ జనరేషన్ కోర్ ఐ7 ప్రాసెసర్ల కన్నా ఈ ప్రాసెసర్లు 29 నుంచి 88 శాతం వరకు ఓవరాల్ ప్రదర్శనను ఎక్కువగా ఇస్తాయి. గ్రాఫిక్స్, డేటా కాపీయింగ్, ఇంటర్నెట్ స్పీడ్ తదితర అనేక అంశాల్లో గత ప్రాసెసర్ల కన్నా కొత్తగా వచ్చిన ఈ 8వ జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్లు మరింత వేగంగా పనిచేస్తాయి. కాగా ఈ ప్రాసెసర్ల ధర వివరాలను మాత్రం ఇంటెల్ ఇంకా వెల్లడించలేదు.