ఖైరతాబాద్ గణేష్: ఆసక్తికరమైన విషయాలు!

Wednesday, September 12th, 2018, 09:09:26 PM IST

వినాయకచవితి అనగానే మొదట ఖైరతాబాద్ వినాయకుడి భారీ విగ్రహం గుర్తుకు వస్తుంది. ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరిగే వినాయకచవితి ఉత్సవాలపైనే అందరి ద్రుష్టి ఉంటుంది. ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా ఖైతాబాద్ గణనాథుడు ఎంతో ప్రత్యేకంగా కనిపించనున్నాడు. అయితే అందుకు సంబందించినక్ విషయాల గురించి తెలుసుకుందాం!

* విగ్రహం ఎత్తు 57 అడుగులు, వెడల్పు 24 అడుగులు

* ప్రతి ఏడాది ఒక అడుగు తగ్గించాలని గత ఏడాది 57 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించాలని అనుకున్నారు.షష్టిపూర్తి సందర్బంగా 60 అడుగుల గణేష్ విగ్రహాన్ని అప్పుడు ప్రతిష్టించారు. దీంతో గత ఏడాది ఉండాల్సిన 57 అడుగుల గణనాథుడు ఈ ఏడాది వచ్చాడు.

* వినాయకుడు ఏడు తలలు, 14 చేతులతో ఆకట్టుకోనున్నాడు.

* సిద్ధాంతి గౌరీభట్ల విఠల్‌ శర్మ సూచనల మేరకు విగ్రహంలో ప్రతిదీ ఏడు వచ్చేలా ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఉత్సవాలు చేసే వారికి, మొక్కే భక్తులకు మంచి జరుగుతుందని సిద్ధాంతి తెలిపారు.

* ఏడు ఏనుగులు నమస్కరిస్తున్నట్లు పక్కనే ఏర్పాటు చేశారు.

* వినాయకుడికి 14 చేతులు ఉన్నాయి. కుడివైపు గల ఏడు చేతుల్లో అంకుశం, చక్రం, కత్తి, సర్పం, బాణం, గద, ఆశీర్వాదం రూపంలో చక్కగా అమర్చారు. ఎడమ వైపు ఏడు చేతుల్లో పాశం, శంకు, కమలం, ఢమరుకం, విల్లు, గడియం, లడ్డు ఉన్నాయి.

* కుడివైపున లక్ష్మీదేవి, ఎడమ వైపున సరస్వతి విగ్రహాలు 14 అడుగుల ఎత్తులో ఉన్నాయి.

* విగ్రహం కోసం నిర్మించిన షెడ్డుకోసం ఆదిలాబాద్‌కు చెందిన 20 మంది బృందం కష్టపడ్డారు.

*మచిలీపట్నానికి చెందిన బృందం వెల్డింగ్‌ పనులు చేసింది.

*షెడ్డును పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం నుంచి తెచ్చిన బలమైన కర్రలతో నిర్మించారు.

* విగ్రహ నిర్మాణంలో ఉపయోగించినవి: ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, మట్టి, ఇనుము, గన్నీ వస్త్రం, కొబ్బరి పీచు, వాటర్‌ పెయింట్స్‌

* గణనాథుడి కుడి పక్కన మండపంలో శ్రీనివాస కళ్యాణ ఘట్టం నిర్మించగా ఎడమవైపు శివపార్వతుల కుటుంబాన్ని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు.

  •  
  •  
  •  
  •  

Comments