ఇంటర్ స్టూడెంట్స్ రెడీగా ఉండండి.. రిజల్ట్స్ వస్తున్నాయ్!

Tuesday, April 10th, 2018, 06:07:56 PM IST

పరీక్షలు అలా పూర్తవ్వగానే విద్యార్థులు సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేయాలనీ చాలా అనుకుంటారు. కానీ రిజల్ట్స్ వచ్చే సరికి చాలా వరకు పరిస్థితులు మారిపోతాయి. గత నెలలో జరిగిన
ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు మరికొన్ని రోజుల్లో రాబోతున్నాయి. విడుదల తేదీని విజయవాడలోని కార్యాలయం నుంచి పరీక్షల నియంత్రణ అధికారి రమేశ్ ఈ విషయాన్ని ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రయోగ, థియరీ, జనరల్, ఒకేషనల్ కోర్సులకు నిర్వహించిన ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఈ నెల 12న వెలువడనున్నాయి. రాజమహేంద్ర వరం లో మధ్యాహ్నం అధికారులు ఫలితాలను అధికారికంగా ఇంటర్నెట్ లో విడుదల చేయనున్నారు. ఇక ఫస్ట్ ఇయర్ ఫలితాలు 13వ తేదీన రానున్నాయి. విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం విడుదల చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇక తెలంగాణ విద్యార్థుల ఇంటర్ ఫలితాలు 12 నుంచి 15 తేదీల మధ్యలో రావచ్చని తెలుస్తోంది. కింద ఇచ్చిన వెబ్‌సైట్ల ద్వారా రిజల్ట్స్ ను తెలుసుకోవచ్చు.

  •  
  •  
  •  
  •  

Comments