వీడు మగాడురా బుజ్జి పరీక్ష పేపర్లో లవ్ లెటర్ రాసి పాస్ చేయమన్నాడు.

Sunday, April 1st, 2018, 04:17:57 PM IST

‘లవ్‌లో పడ్డాను.. పాస్ చేయండి సార్’ అని ఓ విద్యార్థి తన జవాబు పత్రంలో వినతి చేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. పేపర్లు దిద్దుతున్న టీచర్లకు ప్రతీ సంవత్సరం వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. ఓ విద్యార్థి తన కెమిస్ట్రీ ఎగ్జామ్ పేపర్లో ఈ విధంగా రాశాడు. ‘ఐ లవ్ మై పూజ’ అని ఆకర్షణీయంగా పెద్ద అక్షరాలతో రాశాడు. ‘ఈ ప్రేమ చాలా విచిత్రమైనది. ఈ ప్రేమ బతుకనీయదు.. చావనీయదు. ఈ ప్రేమకథ వల్ల పరీక్షలకు చదవలేకపోయాను. మీరే నన్ను పాస్ చేయండి’ అంటూ ఆ విద్యార్థి వేడుకున్నాడు. ఐ లవ్ మై పూజ పక్కన హార్ట్ సింబల్ గీశాడు.

ఇక మరో విద్యార్థి అయితే ఈ విధంగా రాశాడు. ‘నాకు అమ్మ లేదు. నేను పరీక్షల్లో ఫెయిల్ అయితే మా నాన్న నన్ను చంపేస్తారు’ అని రాశాడు. ఇంకో విద్యార్థి టీచర్లను హెచ్చరించాడు. ‘మీరు నన్ను ఫెయిల్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటాను’ అని బెదిరించాడు. ఈ ఘటనలపై ముజఫర్‌నగర్ జిల్లా విద్యాధికారి మునేశ్ కుమార్ మాట్లాడుతూ.. కొంతమంది విద్యార్థులైతే తమను పాస్ చేయాలని కోరుతూ పరీక్ష పేపర్ల మధ్య కరెన్సీ నోట్లు పెడుతున్నారని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments