మహాభారతం కాలంలోనే ఇంటర్నెట్ పుట్టిందా..?

Wednesday, April 18th, 2018, 10:49:04 AM IST

ఇంటర్‌నెట్, శాటిలైట్లు కొత్తేమి కాదని మహాభారత కాలం నుంచే అవి భారత్‌లో మనుగడలో ఉన్నాయని త్రిపుర సీఎం బిప్లవ్‌కుమార్ దెబ్ అన్నారు. కంప్యూటరైజేషన్, సంస్కరణలపై అగర్తలలో జరిగిన ఓ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బిప్లవ్‌కుమార్ మాట్లాడుతూ.. లక్షల సంవ్సరాల క్రితమే ఇంటర్‌నెట్‌ను భారత్ కనుగొన్నదన్నారు. మహాభారత కాలం నుంచే భారత్‌లో ఇంటర్‌నెట్, శాటిలైట్ సేవలు ఉన్నాయన్నారు. ఇందుకు కురుక్షేత్రంలోని ఓ సంఘటనను ఆయన ఉదాహారణగా చెప్పారు. ధ్రుతరాష్టుడి రథసారధి సంజయుడు. చూపులేని ధ్రుతరాష్టుడికి కురుక్షేత్ర యుద్ధం గురించి సవిరంగా సంజయ ఎలా చెప్పగలిగాడు? అంటే సాంకేతిక పరిజ్ఞానం అప్పటికే భారత్‌లో అందుబాబులో ఉందని అర్థమన్నారు. వాటి సహాయం ద్వారానే సంజయ యుద్ధం గురించి చెప్పాడన్నారు.

యూనైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్‌లు తమ ఆవిష్కరణలుగా చెప్పుకుంటున్నప్పటికీ.. వాస్తవానికి అది భారతీయ సాంకేతికతన్నారు. గొప్ప సాంస్కృతిక

చరిత్ర జాతి సొంతమన్నారు. దానిపట్ల తానెంతో గర్వంగా ఫీలవుతున్నానన్నారు. ఇప్పటికే సాంకేతిక రంగంలో మనమే ముందున్నామన్నారు. మైక్రోసాఫ్ట్ యూఎస్ సంస్థే కావచ్చు. కానీ అందులో పనిచేసే ఇంజినీర్లు అత్యధికులు మన దేశానికి చెందినవారేనన్నారు. మహాభారత కాలం నుంచి టెక్నాలజీలో భారత్ ముందున్నదని.. మధ్యలో అది కనుమరుగైందన్నారు. తిరిగి ప్రస్తుతం మళ్లీ టెక్నాలజీలో దూసుకెళ్తుందన్నారు. ప్రపంచానికి అత్యధిక ఇంజినీర్లను అందించడమే ఇందుకు నిదర్శనమన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments