ఐపీఎల్ కోసం 100 మంది కామెంటేటర్లు.. తెలుగోళ్లు వచ్చేశారు!

Thursday, April 5th, 2018, 12:44:30 PM IST

గత పదేళ్ల నుంచి జరుగుతోన్న ఐపీఎల్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే ఊహించని సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కానీ బిసిసిఐ చేతిలో పడ్డాక మొత్తం ఆట రూపు రేఖలు మారిపోయాయి. 11వ సీజన్ మాత్రం స్పెషల్ గా ఉండాలని బాష కూడా అడ్డు రావద్దని నిర్వాహకులు ఆరు భాషల్లో వ్యాఖ్యానం నిర్వహించాడనికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అంతే కాకుండా రీసెంట్ గా వారి జాబితాను కూడా వెల్లడించారు.

దాదాపు 100 మంది కామెంటేటర్లు ఐపీఎల్ కోసం పని చేయడానికి సిద్ధమయ్యారు. ఇంగ్లీష్‌, హిందీ, బంగ్లా, కన్నడ, తమిళ్‌, తెలుగు భాష్లలో మ్యాచ్ లు ప్రసారం కానున్నాయి. ఇప్పటికే తెలుగు ఐపీఎల్ కు జూనియర్ ఎన్టీఆర్ ప్రచార కర్తగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు కామెంటేటర్లుగా వెంకటపతి రాజు, వేణుగోపాల్‌ రావు, కల్యాణ్‌ కృష్ణ, సి.వెంకటేశ్‌, చంద్రశేఖర్‌, పి.సుధీర్‌ మహావడి వంటి క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానం అందించడానికి రెడీ అయ్యారు. ఇక హైదరాబాద్ మాజీ క్రికెటర్ వీవీఎస్.లక్ష్మణ్ హిందిలో కామెంటేటర్ గా సెలెక్ట్ అయ్యాడు.

  •  
  •  
  •  
  •  

Comments