ఐపీఎల్ 2018 : చెన్నై vs కోల్కత్తా గెలుపెవరిది ?

Tuesday, April 10th, 2018, 12:47:33 PM IST

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్లో భాగంగా నేడు చెన్నై జట్టుతో కోల్కత్తా జట్టు తలపడనుంది. అయితే ఇప్పటికే రెండు జట్లు చెరొక విజయంతో మంచి దూకుడుతో వున్నాయి. అయితే చెన్నై జట్టులో కీలక ఆటగాళ్లలో ఒకడైన కేదార్ జాదవ్ సిరీస్ కి దూరమవడం కొంత లోటు అనే చెప్పుకోవాలి. అయినప్పటికీ కాలాక ఆటగాళ్లు ఫామ్ కొంత మేలు కలిగించే విషయం. ఇకపోతే కోల్కత్త జట్టు లో ఆటగాళ్లు కూడా దూకుడు మీదున్నారు. బెంగుళూరు అందించిన 176 స్కోర్ ని ఛేదించి వారు 4 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించారు. కాగా ఈ మ్యాచ్ చెన్నై లోని చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు జరగనుంది…

చెన్నై సూపర్ కింగ్స్ :

ఎన్ని సార్లు ఐపీఎల్ జరిగినప్పటికీ చెన్నై జట్టు ఎక్కువమందికి హాట్ ఫేవరెట్ అని చెప్పుకోవాలి. జట్టులో డ్విన్ బ్రేవో , శని వాట్సన్ మంచి ఫామ్ లో ఉండడం. అలానే అంబటి రాయుడు కూడా వీరికి కొత్త బలం. ఇకపోతే బౌలింగ్ విభాగంలో షేన్ వాట్సన్, ఇమ్రాన్ తాహిర్ మంచి ప్రతిభ కనపరుస్తున్నారు. ఇక ధోని, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, దీపక్ చాహర్ వంటివారు అలానే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఫామ్ లోకి వస్తే చెన్నై కి చాలా వరకు ఎదురు ఉండదనే చెప్పుకోవాలి…..

కోల్కత్తా నైట్ రైడర్స్ :

కోల్కత్త జట్టులో అనూహ్యంగా సునీల్ నారిని గత రెండు ఐపీఎల్ సీజన్ల నుండి మంచి ప్రతిభ కనపరుస్తున్నాడు. మొన్న బెంగుళూరు తో జరిగిన మ్యాచ్ లో అతడు చెలరేగి ఆడిన విషయం తెలిసిందే. ఇక బాటింగ్ విభాగంలో నితీష్ రానా, దినేష్ కార్తీక్ ఉందనే వున్నారు. వారు కూడా మొదటి మ్యాచ్ లో బాగా ఆడారు. ఇక రాబిన్ ఉతప్ప కూడా ఆ మ్యాచ్ లో పర్వాలేదనిపించాడు. ఇకపోతే బౌలింగ్ విభాగంలో మిచెల్ జూన్సన్, వినయ్ కుమార్, పీయూష్ చావ్లా బాగా రాణిస్తున్నారు. ఇకపోతే నితీష్ రానా అల్రౌండ్ పెర్ఫార్మన్స్ తో అదరగొడుతున్నాడు. ప్రధాన బాట్స్ మాన్ మరికొంత రాణిస్తే ఈ జట్టుకు కూడా తిరుగుండదు అని చెప్పవచ్చు…