ఆ ఆటగాళ్ల ను పట్టించుకోని ఐపీఎల్ టీమ్స్.. గేల్ పరిస్థితి దారుణం!

Saturday, January 27th, 2018, 04:27:08 PM IST

టీ20 మ్యాచ్ ల అసలు మాజాని చూపించిన ఐపీఎల్ ప్రపంచంలోనే బెస్ట్ టోర్నమెంట్ గా గుర్తింపు పొందింది. దీంతో చాలా మంది ఆటగాళ్లు మ్యాచ్ లపై ఆసక్తి చూపుతున్నారు. ఐపీఎల్ 2018 ఆక్షన్ ఈ రోజు గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. అయితే ఎవరికీ ఎవరికీ వారు నచ్చిన ప్లేయర్స్ ని దక్కించుకున్నారు. కొంత మంది వేలం పాట ను చాలా పోటా పోటీగా కొనసాగించారు. ఇక అసలు విషయానికి వస్తే.. ఎవరు ఊహించని విధంగా కొంత మంది ఆటగాళ్లను ఏ టీమ్స్ తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ముఖ్యంగా వరల్డ్ టి20 డేంజరస్ బ్యాట్స్ మెన్ గా గుర్తింపు తెచ్చుకున్న క్రిస్ గేల్ ను ఎవరు తీసుకోలేదు. కనీస ధర 2 కోట్లు అనగానే అతన్ని కొనుక్కోవడానికి ఎవరు సాహసించలేకపోయారు.
2011 & 2012 ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ను అందుకున్న గేల్ 5 మొత్తంగా 5 సెంచరీలు 21 ఆఫ్ సెంచరీలు చేశాడు. అయితే గత కొంత కాలంగా అతను ఫామ్ లో లేకపోవడం వల్ల ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక లాజిత్ మలింగాను కూడా ఎవరు కొనుక్కోలేదు. అలాగే ఇషాంత్ శర్మ వైపు కూడా మొగ్గు చూపలేదు. జోయి రూట్ – హషిమ్ ఆమ్లా – మురళి విజయ్ – జేమ్స్ ఫాల్కనర్ – మార్టిన్ గుప్తిల్ లాంటి ఆటగాళ్లను కూడా పక్కన పెట్టేశారు.