అవును బెట్టింగ్ లో డబ్బు పోగొట్టుకున్నా: సల్మాన్ సోదరుడు

Saturday, June 2nd, 2018, 04:00:24 PM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ బెట్టింగ్ కు పాల్పడినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు సమన్లు అందిచగా నేడు ఉదయం విచారణకు హాజరయ్యాడు. బెట్టింగ్ కు పాల్పడినట్లు అర్బాజ్ పోలీసుల ఎదుట నిజాన్ని చెప్పినట్లు తెలిసింది. దాదాపు మూడు కోట్ల వరకు అతను డబ్బు పోగొట్టుకున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే అర్బాజ్ 2.78 కోట్ల రూపాయలు బెట్టింగ్ చేసి పోగొట్టుకున్నట్లు విచారణలో ధ్రువీకరించారు.

శనివారం మహారాష్ట్రలోని థానె పోలీసుల వద్ద అర్బాజ్ ఖాన్ తో పాటు మరికొంత మంది విచారణకు హాజరయ్యారు. అందులో ప్రధాన నిందితుడైన సోను అనే బుకీ కూడా ఉన్నాడు. అతని ద్వారానే ఈ బెట్టింగ్ విషయాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మరికొంత మంది బాడా నేతల అనుచరుల పేర్లు బాలీవుడ్ తారల పేర్లు కూడా ఉన్నట్లు టాక్ వస్తోంది. వ్యాపారవేత్తల కుమారులు కూడా బెట్టింగ్ చేసినట్లు సోనూ డైరీలో నోట్ చేసుకున్న వివరణలను బట్టి పోలీసులు కూపీ లాగుతున్నారు. అయితే బడా బాబుల పేర్లను పోలీసులు ఇంకా బయటకు చెప్పడం లేదు.

  •  
  •  
  •  
  •  

Comments