మరొక వినూత్న రికార్డు ఐపీల్ సొంతం !

Friday, February 9th, 2018, 03:46:08 PM IST

వాస్తవానికి క్రికెట్ లో ఐపీల్ ప్రవేశం తర్వాత భారత క్రికెట్ కు మరొక కొత్త రూపు వచ్చినట్లయింది. ప్రస్తుతం భారత్ ఆడే అన్నిరకాల ఫార్మట్ మ్యాచ్లలోకి అత్యధికులు ఐపీల్ కె మొగ్గు చూపుతున్నట్లు ఒక సమాచారం. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ లీగ్‌ల్లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)దే అగ్రస్థానం. అంతర్జాతీయంగా ఉన్న క్రికెట్ లీగ్‌లతో పోలిస్తే ఆదరణ, వీక్షకులు, బ్రాండ్ పరంగా ఐపీఎల్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ వేలానికి కూడా విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. సాధారణంగా లైవ్ మ్యాచ్‌లు చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపే అభిమానులు, ఈసారి ఐపీఎల్‌ వేలం లో ఏ ఆటగాడు ఎంతకి అమ్ముడుపోతాడో అని ఆసక్తితో కూడా భారీ స్థాయిలో వీక్షించారట .

గత నెలలో ఐపీఎల్‌-11 సీజన్‌ కోసం బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన వేలాన్ని అత్యధికులు వీక్షించినట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల కోసం నిర్వహించిన వేలాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయగా వేలం ప్రక్రియను 4.65 కోట్ల మంది వీక్షించినట్లు సంస్థ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇది ఒకటి కాదు రెండు కాదు, ఐదు రెట్లు అధికమని తెలుస్తోంది.ఈ స్థాయి వీక్షకులతో ఆల్‌ టైమ్‌ రికార్డును సొంతం చేసుకుంది. ఈ వేలం కార్యక్రమాన్ని ఆరు ఛానెళ్లలో ప్రసారం చేసిన విషయం తెలిసిందే. టీవీతో పాటు సామాజిక మాధ్యమం హాట్‌స్టార్‌లో కూడా ఈ వీక్షకుల సంఖ్య దాదాపు ఐదు రెట్లు పెరినట్లు స్టార్ సంస్థ తమ నివేదిక లో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్థాయిలో ఆదరణ లభించిందని స్టార్‌ ఇండియా ఎండీ సంజయ్‌ గుప్తా తెలిపారు. ఇప్పటివరకు ఐపీల్ ను సోనీ సంస్థ దక్కించుకోగా, రానున్న ఐదు సంవత్సరాలకు గాను స్టార్ సంస్థ ఇటీవల హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే….