ఐపీఎల్ పోల్ : మొదటి రోజు ఎవరి బలం ఎంత?

Saturday, April 7th, 2018, 01:22:19 AM IST

 

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోన్న ఏప్రిల్ 7 రానే వచ్చేసింది. రేపటి నుంచి ప్రతి క్రికెట్ అభిమాని ఇంట్లో టీవీ సౌండ్ పెరుగుతుంది అనడంలో ఎలాంటిఇ సందేహం లేదు. ఐపీఎల్ 11 ఈ సారి చాలా స్పెషల్ గా జరుగుతుండడంతో అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2018లో ప్రతి జట్టు కొత్తహాగా అనిపిస్తోంది. రెండేళ్లు నిషేధానికి గురైన చెన్నై – రాజస్థాన్ జట్లు మళ్లీ రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొత్తంగా 8 జట్లు వారి బాలలతో చాలా సిద్ధంగా ఉన్నాయి. ఎలాగైనా ట్రోపిని అందుకోవాలని చాలా కష్టపడుతున్నాయి.

సీజన్ లో ఆడుతోన్న8 జట్లు ఒక్కో జట్టుతో రెండు సార్లు తలపడతాయి. అంటే మొత్తంగా ఒక్కో టీమ్ 14 మ్యాచ్ లు ఆడతాయి. ఒక్క మ్యాచ్ గెలిస్తే రెండు పాయింట్లు. డ్రా అయినా మ్యాచ్ ఇతర కారణాల వల్ల క్యాన్సిల్ అయినా ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. ఇకపోతే ఐపీఎల్ 11వ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ చెన్నై – ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది ఒకసారి ఇరు జట్ల బాలా బాలలను చూస్తే..

చెన్నై సూపర్ కింగ్స్:

ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టు ధోని ఉన్నంత వరకు ఫైనల్ వెళ్లే వరకు పోరాడింది. మొదటి ఐపీఎల్ లోనే ఫైనల్ కు వెళ్లిన చెన్నై రాజస్థాన్ చేతిలో ఓడింది. ఇక 2010 – 2011 సీజన్స్ లో వరుసగా ట్రోపిని గెలుచుకుంది. మొదట జట్టుకు బలం ఏదైనా ఉందా అంటే అది ధోని కెప్టెన్సీ అని చెప్పాలి. ఇక సురేష్ రైనా అతనికి లక్ష్మణుడి లాంటి ఆయుధం. ఇక సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు డూ ఫ్లెసిస్ – ఇమ్రాన్ తాహిర్ ఉన్నారు. ఒకరు బ్యాటింగ్ లో శూరుడు. మరొకరు బౌలింగ్ లో ధీరుడు. షేన్ వాట్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆల్ రౌండర్ కావడంతో జట్టుకు మరో ఆయుధం. అలాగే డారెన్ బ్రేవో – మిచెల్ శాంటేనేర్ కూడా ఆల్ రౌండర్లే. ఇక చచెన్నై జట్టులో అంబటి రాయుడు – కేదార్ జాదవ్ – మురళి విజయ్ తో పాటు శార్దూల్ ఠాకూర్ – కర్న్ శర్మ కూడా ఉన్నారు. బ్యాటింగ్ లో జట్టు బలంగా ఉన్నా బౌలింగ్ లో మాత్రం కొంచెం వీక్ గా ఉంది. మొదటి మ్యాచ్ చుస్తే జట్టు అసలు బలం ఏంటో అర్ధమవుతుంది. అయితే మ్యాచ్ లో నలుగురు విదేశీయులే ఆడతారు. మిగతా ఏడుగురు భారతీయులు ఉండాలి. అది టోర్నీ రూల్.

అతి ముఖ్యమైన ప్లేయర్లు : సురేష్ రైనా – డారెన్ బ్రేవో – ధోని – వాట్సన్

ముంబై ఇండియన్స్:

ఇక గత ఏడాది రోహిత్ శర్మ నాయకత్వంలో ఐపీఎల్ 10 ట్రోపిని గెలిచినా సంగతి తెలిసిందే. ముంబై జట్టు కూడా ప్రతి సీజన్ మంచి పోటీని ఇస్తోంది. 2013 – 2015 లో కూడా ఆ జట్టే ట్రోపిని అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఈ జట్టే మూడు ట్రోపీలను అందుకుంది. ఇక జట్టు విషయానికి వస్తే టీమ్ లో కీలక ఆటగాళ్లను యాజమాన్యం అస్సలు వదులుకోలేదు. రోహిత్ శర్మ – పాండ్య బ్రదర్స్ – బుమ్రా పోలార్డ్ – మిచెల్ అలానే ఉన్నారు. క్రునల్ పాండ్య – హార్దిక్ పాండ్య ఆల్ రౌండర్ గా ఉండడం పెద్ద ప్లస్ పాయింట్. పోలార్డ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడు. డుమిని – ముస్తాఫిజుర్ రెహమాన్ – బెన్ కట్టింగ్ లాంటి ఆటగాళ్లు ఈ సారి జట్టులో చేరారు. బ్యాటింగ్ లైనప్ అలాగే బౌలింగ్ లో ఈ జట్టు అన్ని టీములకంటే బలంగా ఉంది. మరి మొదటి మ్యాచ్ లో ఎంతవరకు రాణిస్తారో చూడాలి.

అతి ముఖ్యమైన ప్లేయర్స్: రోహిత్ – పాండ్య బ్రదర్స్ – పోలార్డ్ – బుమ్రా – డుమిని