మొదటి మ్యాచ్ ఊపిరిని ఆపేసింది.. చెన్నై బోణి!

Sunday, April 8th, 2018, 01:04:45 AM IST


2018 ఐపీఎల్ మొదటి మ్యాచ్ ముంబై లో చాలా గ్రాండ్ గా జరిగింది. స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోగా ఆటగాళ్లు వారి బాలా బాలలను గట్టిగానే చూపించారు. ముంబై ఇండియన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠను రేపింది. మొత్తంగా ఒక నిమిషం ఊపిరి బిగబెట్టేంత పని చేసింది. అయితే మొదటి విజయం మాత్రం ధోని న్యాయకత్వంలో చెన్నైకి దక్కింది. 11వ సీజన్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ముంబై మొదటి పరాజయాన్ని చూసింది. చివరి వరకు ఈ మ్యాచ్ చాలా ఆసక్తిని రేపింది. ఒకానొక దశలో ముంబై తీగెలుస్తుందని అంతా అనుకున్నారు. చివరి ఓవర్లో జాదవ్ మంచి ఆట తీరుతో ఒక బంతి మిగిలి ఉండగానే మ్యాచ్ ను ముగించాడు.

మొదట టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన ముంబై నిర్ణిత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. పాండ్య బ్రదర్స్ చివరలో మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా క్రునల్ పాండ్య 41(22) పరుగులు చేశాడు. అందులో 5 సిక్సులు 2 ఫోర్లు ఉన్నాయి. మొదట సూర్య కుమార్ (43), ఇషాన్ కిషన్ (40) మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక చెన్నై జట్టులో దీపక్ చాహర్ -ఇమ్రాన్ తాహిర్ చెరో వికెట్ దక్కించుకోగా వాట్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 166 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన చెన్నై కోలుకుంటున్న ప్రతి సారి వికెట్ కోల్పోయింది. ముంబై బౌలర్లు చాలా వరకు కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. కానీ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో 68(30) 3 ఫోర్లు 7 సిక్సర్లతో విరుచుకుపడి చెన్నై జట్టులో ఆశలు నింపాడు. కానీ 18 ఓవర్లో ఎవరు ఊహించని విధంగా బుమ్రా బౌలింగ్ లో రోహిత్ కి క్యాచ్ ఇచ్చి భ్ర బ్రావో అవుట్ అయ్యాడు. ఇక అంతా అయిపొయింది అనుకుంటున్నా సమయంలో చెన్నై ఫ్యాన్స్ లో ఆశలు నింపడానికి అంతకుముందు రిటెర్డ్‌హర్ట్‌ అయిన జాధవ్ మళ్లీ గ్రీజులోకి వచ్చాడు. చివర్లో ఒక సిక్సు – ఫోర్ కొట్టి చెన్నై కి మొదటి విజయాన్ని అందించడంలో కీలకపాత్ర పోషించాడు.