ఐపీఎల్ పోల్ : రెండవ పోరులో ఎవరు గెలుస్తారు?

Sunday, April 8th, 2018, 09:26:32 AM IST

మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠతో సాగింది. చెన్నై గెలవడంతో ధోని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇకపోతే ఆదివారం రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ – ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరగనున్నాయి. నాలుగు గంటలకు మొహాలీ స్టేడియంలో మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ రెండు టీమ్ లు ఈ సారి చాలా ప్లానింగ్ తో ఐపీఎల్ బరిలోకి దిగుతున్నాయి. ఇంతవరకు ట్రోపి ని అందుకోని ఈ జట్లు ఈ సారి ఎలాగైనా ఐపీఎల్ 11 కప్ ని అందుకోవాలని చూస్తున్నాయి.

ఢిల్లీ డేర్ డెవిల్స్:

ఈ జట్టు గత ఏడాది పాయింట్స్ పట్టికలో నాలుగవ స్థానం కోసం చాలా కష్టపడింది. కీలకమైన ఆటగాళ్లు సమర్ధవంతగా రాణించకపోవడం అప్పట్లో పెద్ద మైనెస్ అయ్యింది. అయితే ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ కెప్టెన్ గా గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ గంబీర్ ఈ సారి ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించడం ప్లస్ పాయింటే. అలాగే గ్లేన్ మ్యాక్స్ వెల్ జట్టులో చేరడం మరో పెద్ద ప్లస్ పాయింట్. ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ – విజయ్ శంకర్ తో పాటు కోలిన్ మున్రో కూడా మంచి ఆటగాడి. ఆల్ రౌండర్లను కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ప్రతి గేమ్ లో ఢిల్లీ గట్టి పోటీని ఇవ్వగలదు.

ముఖ్యమైన ప్లేయర్స్: మ్యాక్స్ వెల్ – గంబీర్ – క్రిస్ మోరిస్ – శ్రేయాస్ అయ్యర్

పంజాబ్:
పంజాబ్ లో గత ఏడాది కంటే ఈ సారి కొంచెం మార్పులు ఎక్కువగా జరిగాయి. జట్టులో కొత్త ఆటగాళ్లు చేరడంతో కొత్త కళ ఏర్పడింది. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ ఈ సారి పంజాబ్ కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యాడు. ఇక డేవిడ్ మిల్లర్ – అక్షర్ – పటేల్ అలాగే మార్కస్ స్టయినస్ వంటి ఆటగాళ్లను యాజమాన్యం వదులుకోలేదు. ఇక ఎవరు ఊహించని విధంగా చివర్లో క్రిస్ గేల్ ను దక్కించుకుంది. గత కొంత కాలంగా ఫామ్ లో లేని గేల్ ఈ సారి ఫామ్ లోకి వస్తే పంజాబ్ కి తిరుగుండదు. ఆరోన్ ఫించ్ – యువరాజ్ కూడా మంచి ఆటను కనబరిస్తే జట్టు 11వ సీజన్ లో ట్రోపి గెలిచే ఛాన్స్ అందుకుంటుంది.

ముఖ్యమైన ప్లేయర్స్ : డేవిడ్ మిల్లర్ – ఆరోన్ ఫించ్ – అశ్విన్ – మయాంక్ అగర్వాల్

  •  
  •  
  •  
  •  

Comments