ఐపీఎల్ స్పెషల్ వీడియో :౩౩ సెకన్లలో ౩౩ సిక్స్ లు ధోని vs కోహ్లి

Thursday, April 26th, 2018, 05:20:31 PM IST

ఐపీఎల్-11లో భాగంగా బుధవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు రసవత్తరంగా సాగింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 400కు పైగా స్కోరు నమోదైంది. అభిమానులతో కిక్కిరిసిపోయిన స్టేడియంలో ఇరు జట్ల ఆటగాళ్లు సిక్సర్ల వర్షం కురిపించారు. ఐపీఎల్‌లో రికార్డు కుడా బ్రేక్ అయింది. ఆర్‌సీబీ జట్టులో అత్యధికంగా డివిలియర్స్(8సిక్స్‌లు), డికాక్(4), మన్‌దీప్ సింగ్(3), వాషింగ్టన్ సుందర్(1) కలిపి మొత్తం 16 బాదారు. లక్ష్య ఛేదనలో చెన్నై బ్యాట్స్‌మెన్లలో అత్యధికంగా అంబటి రాయుడు(8), మహేంద్రసింగ్ ధోనీ(7), షేన్ వాట్సన్(1), డ్వేన్ బ్రావో(1) కలిపి 17 భారీ సిక్సర్లు కొట్టారు.

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్ ఇదే కావడం విశేషం. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మొత్తం 33 సిక్సర్లు బాదేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 10న కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 31 సిక్సర్లు నమోదయ్యాయి. అంతకుముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్, గుజరాత్ లయన్స్ మధ్య పోరులో కూడా 31 సిక్సర్లు బాదేశారు. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో హిట్టర్లు బాదిన 33 సిక్స్‌లను 33 సెకన్లలో వీక్షించండి.