ఓ అమెరికా కొంచెం జాగ్రత్తగా ఉండు.. యుద్ధం వస్తే మీకే నష్టం!

Friday, July 27th, 2018, 09:54:46 PM IST

ప్రపంచానికి పెద్దన్న దేశంగా ఉన్న అమెరికా అంటే చాలా దేశాలకు ఒకప్పుడు భయం ఉండేది. ఆ దేశం చెప్పినట్లుగానే నడుచుకోవడం చెప్పినమాటకు ఎదురుచెప్పకూడదు అనే సిద్దాంతాలు ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం అమెరికా ప్రస్తావన వస్తే.. అయితే ఏంటి? అనే పరిస్థితికి వచ్చింది. ఒబామా ఉన్నప్పుడు చాలా వరకు ఎదురుతిరిగిన దేశాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఎగుమతులకు దిగుమతులకు సంబంధించి అమెరికా చెప్పిందే జరిగేది. ఇక ఇప్పుడు మాత్రం అమెరికాకు ఎవరు లొంగడం లేదు.

స్నేహపూర్వకంగా ఏవైనా ఒప్పందాలు కుదుర్చుకుంటే ఒకే గాని పెత్తనం చెలాయిస్తే కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. రీసెంట్ గా ఇస్లామిక్ ఇరాన్ కూడా అదే తరహాలో కౌంటర్ ఇచ్చింది. గత కొంతకాలంగా ఇరుదేశాల అధ్యక్షుల మధ్య ట్విట్టర్ లో వార్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇరాన్ సైనికాధికారి మేజర్‌ జనరల్‌ (ఎలైట్‌ రివల్యూషనరీ గార్డ్‌) ఖ్వాసీం సోలిమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా మాకు దగ్గరగా ఉంటుంది. యుద్దానికి సిద్ధమైతే చాలా నష్టపోతారు. మీరు స్టార్ట్ చేస్తే మేము ముగింపు ఇస్తాం. ఓ సైనికాధికారిగా నేను చెప్పాల్సింది చెబుతున్నా. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాలనీ అనుకుంటే నాతో మాట్లాడండి. మా దేశ అధ్యక్షుడు మీతో మాట్లాడితే ఆయనకు గౌరవంగా ఉండదు. అలోచించి మెసులుకోండని సోలిమాని హెచ్చరికలు జారి చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments