ప్రయాణీకులకు ఐఆర్‌సీటీసీ లక్కీ ఆఫర్!

Friday, April 20th, 2018, 01:10:23 AM IST


ఇప్పటికే ప్రయాణీకులకు పలురకాల ఆఫర్లను ప్రకటించిన ఐఆర్‌సీటీసీ తాజాగా కళ్ళు చెదిరే ఓ లక్కీ ఆఫర్ ను అందిస్తోంది. ఐఆర్‌సీటీసీ ద్వారా టిక్కెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణీకులకు రూ.10వేలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఆధార్‌ కార్డును ప్రజా బాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఓ ‘లక్కీ డ్రా’ స్కీమును ప్రవేశపెట్టాయి. దీని ప్రకారం వినియోగదారులు ఎవరైతే ఐఆర్‌సీటీసీ ద్వారా టిక్కెట్‌ తీసుకుంటారో వారు తమ ఐఆర్‌సీటీసీ యూజర్‌ ఐడీకి తమ ఆధార్‌కార్డును అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా వారు ఈ లక్కీడ్రాలో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారు.కాగా వచ్చే నెల రెండో వారంలో ప్రయాణించే వారి నుంచి ఐదుగురిని ఎంపిక చేసి వారికి ఈ బహుమతి సొమ్ము అందించనున్నారు.

అంతేకాదు, వారి రైలు ప్రయాణ టిక్కెట్‌కు అయిన మొత్తం ఖర్చును సైతం వెనక్కి ఇస్తారు. అయితే దీనికి ఐఆర్‌సీటీసీలో నమోదు చేసుకున్న వినియోగదారులు మాత్రమే అర్హులు. కేవైసీకి తమ ఆధార్‌ను అనుసంధానం చేసుకుని ఉండాలి. టిక్కెట్‌లో పేర్కొన్న
ప్రయాణీకుల జాబితాలో కనీసం ఒకపేరుతో అయినా ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ ప్రొఫైల్‌ పేరు లేదా ప్రయాణీకుడి పేరు సరిపోవాలి. మరి ఇంకెదుకు ఆలస్యం, మీరు కూడా రైలు ప్రయాణం చేయదలిస్తే ఇకపై ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకోండి మరి…..

  •  
  •  
  •  
  •  

Comments