సేనానికి ఫోన్ కలిపిన చంద్రబాబు..!!

Sunday, February 4th, 2018, 12:31:43 PM IST

ఎన్డీయే లో టీడీపీ, శివసేన పార్టీలు అతిపెద్ద భాగస్వాములుగా ఉన్నాయి. ఉద్దవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన బిజెపికి ఎప్పుడో టాటా చెప్పేసింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే స్పష్టం చేసాడు. గత నాలుగేళ్లుగా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నా అర్థ రూపాయి ఆదాయం కూడా లేకపోవడంతో చంద్రబాబు హార్ట్ అయ్యారు. బడ్జెట్ లో కూడా మోడీ తనదైన శైలిలో ఏపీకి టోపీ పెట్టారు.

ఇక ఉపేక్షిస్తే లాభం లేదని భావించ చంద్రబాబు పార్టీ ఎంపిలు నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇంతలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శివ సేన అధినేత ఉద్దవ్ ఠాక్రే తో చంద్రబాబు ఫోన్ లో మంతనాలు జరిపారట. ఈ వార్తని శివసేన పార్టీ ధృవీకరించింది. చంద్రబాబు సంచలనాత్మక నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం జోరందుకుంది. టీడీపీ ఎంపీలు సై అంటే సై అని అంటున్నారు.