ఫస్ట్ టీ20.. పసికూనతో పోరుకు సిద్దమైన టీమిండియా!

Wednesday, June 27th, 2018, 12:59:56 PM IST

టీమిండియా చాలా కాలం తరువాత సుదీర్ఘ పర్యటనకు సిద్ధమైంది. ఐర్లాండ్ – ఇంగ్లాండ్ టూర్ లతో బిజీ బిజీగా గడపనున్నారు. ఐపీఎల్ తో కొంత మంది ఆటగాళ్లు ఫుల్ ఫార్మ్ లోకి వచ్చారు. ఇక నేడు ఐర్లాండ్ తో భారత్ మొదటి టీ20 ఆడనుంది. డబ్లిన్ వేదికగా ఈ మ్యాచ్ 8.30 నిమిషాలకు స్టార్ట్ కానుంది. అయితే జట్టులో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ బ్యాటింగ్ లైనప్ లో స్ట్రాంగ్ గా ఉన్నారు.

ఇక మరో బ్యాట్స్ మెన్ కోసం సురేష్ రైనా – కేఎల్ రాహుల్ – మనీష్ పాండే పోటీ పడనున్నారు. కీపర్ గా ధోని ఫిక్స్ ఇక దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, బుమ్రా కుల్దీప్ యాదవ్ కూడా జట్ట్లులో ఉండే అవకాశ ఉంది. చివరగా చాహల్ లేదా ఉమేష్ యాదవ్ లలో ఎవరో ఒకరు ప్లేయింగ్ 11లో స్థానం అందుకోనున్నారు. ఇక ఐర్లాండ్ జట్టు ఈ మధ్య బలంగా మారింది. మరి ఇండియాకి ఏ స్థాయిలో ఇస్తుందో చూడాలి. ఇక సెకండ్ టీ20 ఈ నెల 29న జరగనుంది.