అల్లు అర్జున్ ఆ సినిమాకు సీక్వెల్ చేయనున్నాడా?

Thursday, May 10th, 2018, 02:09:07 AM IST


స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో 2014లో వచ్చిన సూపర్ హిట్ సినిమా రేసుగుర్రం. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ మరియు ఎంటర్టైన్మెంట్తో కూడిన చిత్రం అవడంతో అప్పట్లో అది మంచి విజయాన్ని అందుకుంది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం దర్శకుడు సురేందర్రెడ్డి ఒక మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ,

తనకు ఎంతో ఇష్టమైన రేసుగుర్రం చిత్రానికి ఎప్పటికైనా సీక్వెల్ చేస్తానని, అదికూడా బన్నీతోనే ఉంటుందని చెప్పకనే చెప్పాడు. కాగా ప్రస్తుతం సురేందర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహారెడ్డి చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం అనంతరం బన్నీతో రేసుగుర్రం సీక్వెల్ ప్లాన్ చేసే అవకాశం కనిపిస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అయితే ఒక్క బాహుబలి మినహా మరేచిత్రం కూడా టాలీవుడ్ లో విజయాన్ని అందుకోలేదు. మరి రేసుగుర్రం సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రం ఏ మేరకు విజయం సాధిస్తుందో వేచిచూడాలి…….