అధికార పార్టీలో సీతయ్యగా బాబు మోహన్ !

Wednesday, January 17th, 2018, 08:25:21 PM IST

సినీనటుడు, టిఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన బాబు మోహన్ పై ఆయన సొంత నియోజకవర్గంలో నిరసన గళం వినిపిస్తోంది. బాబు మోహన్ వైఖరితో అందోల్ – జోగిపేట నగర చైర్ పర్సన్ కవిత సురేందర్ తన అనుచరులతో ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. బాబు మోహన్ నియోజకవర్గంలో నియంతలా మరి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లుగా నగరంలో ఒక్క అభివృద్ధి పని కూడా పూర్తి కాలేదని కవిత ఆరోపించారు.

అందోల్ పంచాయతీ లో రూ 7 కోట్ల నిధులు ఉన్నాయి. అభివృద్ధి పనులకు సంబందించిన టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. కానీ అధికారులు మాత్రం పనులు ప్రారంభించడం లేదు. అధికారులపై పెత్తనం చెలాయిస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమె అన్నారు. నగర పాలక వర్గం సభ్యులం మేమంతా ఇదివరకే బాబు మోహన్ ని పలు మార్లు విన్నవించుకున్నాం అయినా ఫలితం లేదు అని అంటున్నారు. అభివృద్ధి పనులకు సంబందించిన కాంట్రాక్టు విషయంలో బాబు మోహన్ అసంతృప్తిగా ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. బాబు మోహన్ వైఖరి కి నిరసనగా వారంతా నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు.

  •  
  •  
  •  
  •  

Comments