బర్నింగ్ ఇష్యూ : నిజంగా అశ్లీల వెబ్సైటులు నిలిపివేస్తే ఇటువంటి ఘటనలు ఆగుతాయా?

Wednesday, April 25th, 2018, 03:39:43 AM IST

ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న కథువా, వున్నావ్ ఘటనలను తలుచుకుంటే నిజంగా అటువంటి క్రూరులని నడిరోడ్డులో వురి తీసి చంపాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా ఇటువంటి సంఘటనలు మాత్రం దేశంలో అక్కడక్కజరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలకు భద్రత లేకుండాపోయింది. మృగాళ్ల పైశాచికత్వానికి ఎందరో అమ్మాయిలు, మహిళలు బలైపోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై కొందరు మాట్లాడుతూ, అశ్లీల చిత్రాల వెబ్సైటులు బ్యాన్ చేయడం వల్ల ఇటువంటి ఘటనలు కొంతవరకు నియంత్రించవచ్చని తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. అలానే మరికొందరైతే అసలు ఈ విధమైన ప్రవృత్తికి కేవలం అశ్లీల వెబ్సైటుల బ్యాన్ ఒక్కటే సరిపోదని, మనిషి ఆలోచన విధానం మారాలని, ఇలా తప్పులు చేసేవారికి కఠిన శిక్షలు అమలు చేయాలనీ అంటున్నారు.

ఎందుకంటే నిజానికి కొన్ని కోట్ల జనాభా వున్న మన భారత దేశంలో ఎక్కడో అక్కడ ఇటువంటి ఘటనలు జరుగుతుంటాయని, అందువల్ల ఈ విషయాన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదనేది మరికొందరి వాదన. ఇలా తమ అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నవారి విషయం అటుంచితే, అసలు మనిషి ఎటుపోతున్నాడు, ఏమి చేస్తున్నాడు, ఎందకు రోజురోజుకి ఇలా నీచంగా మృగం కంటే దారుణంగా తయారవుతున్నాడు అనే దానికి ప్రధాన కారణం అతని ప్రవర్తన అలానే అతని కుటుంబ నేపధ్యం, అతను పెరిగిన కుటుంబ వాతావరణం అని కొందరు మానసిక నిపుణులు అంటున్నారు. అందువల్ల మనం చుట్టుప్రక్కల వున్న వారిలో చెడుని పట్టించుకోకుండా మంచిని కనుక గ్రహించి తీసుకుంటే మెల్లగా ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట వేయవచ్చని వారి అభిప్రాయం…..

  •  
  •  
  •  
  •  

Comments