అజ్ఞాతవాసిని చూసి జాగ్రత్త పడ్డ మహేష్ – కొరటాల..?

Monday, January 29th, 2018, 08:16:27 PM IST

స్పైడర్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా అభిమానులకు అందించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. మహేష్ బాబు, కొరటాల దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు చిత్రం ఘనవిజయం సాధించింది. మహేష్ కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. శ్రీమంతుడు చిత్రం తాను రాసిన నవలకు కాపీ అని ఓ రచయిత కోర్టు మెట్లు ఎక్కడం ఇది పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

భరత్ అనే చిత్రం గురించి సినీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. భరత్ అనే నేను.. మైకేల్ డగ్లస్ అనే హాలీవుడ్ చిత్రానికి ఫ్రీమేక్ అంటూ వార్తలు వస్తున్నాయి. కొరటాల మళ్లీ కాపీ ఫార్ములానే అప్లై చేయబోతున్నారంటూ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. అజ్ఞాతవాసి చిత్రం కూడా కాపీరైట్ వివాదం లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తరువాత కొరటాల జాగ్రత్తపడ్డాడట. కాపీ అనిపిస్తున్న సన్నివేశాలని రీ షూట్ చేసి మార్చినట్లు చెప్పుకుంటున్నారు. దీని వల్లనే చిత్ర విడుదల ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.