కర్ణాటక పీఠం భాజపావశం కానుందా?

Sunday, May 13th, 2018, 03:08:24 PM IST

మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికలు ఎంత ఉత్కంఠతతో జరిగాయో అందరికి తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, బిజెపి జాతీయ నేతలు రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీలు కర్ణాటకలోని ప్రధాన ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. అలానే మరోవైపు జేడీఎస్ పార్టీ కూడా గట్టిగానే ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించింది. అయితే ఎన్నికల అనంతరం కొన్ని ప్రముఖ సంస్థల సర్వే ల ప్రకారం ఎగ్జిట్ పోల్స్ లో భారతీయ జనతా పార్టీకి అక్కడ అత్యధిక సీట్లు వస్తాయని, మెజారిటీ సాధించి ఆ పార్టీనే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెపుతున్నాయి. ఇప్పటికే టైమ్స్ నౌ, సి ఎన్ ఎన్ ఐబిఎన్, జెన్ కి బాత్, సి ఎన్ ఎక్స్ వంటి సంస్థలు బిజెపికి ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు చెపుతున్నాయి.

కాగా కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా ధీమాగా వున్నారు. కొన్ని పోల్స్ మా పార్టీ అధికారంలోకి వస్తాయని చూపుతున్నాయని, క్రితంసారి మేము ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాకర్షక పధకాలు ఖచ్చితంగా ప్రజల్ని మమ్మల్ని గెలిపించేలా చేస్తాయని అయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జేడీఎస్ అధినేత దేవెగౌడ మాట్లాడుతూ ప్రజా నాడిని ఎవరూ పట్టలేరని, సర్వేలు చెప్పినట్లు ఇదివరకు కొన్ని ఎన్నికల్లో ఫలితాల్లో మార్పులు వచ్చాయని, అందువల్ల తాము సర్వేలకంటే ప్రజలనే ఎక్కువనమ్మామని అన్నారు. కాగా ఈనెల 15న కౌంటింగ్ తర్వాత ఏ పార్టీ భవితవ్యం ఎలాఉంటుందో తేలనుంది……

Comments