తెలంగాణలో బీజేపీ గెలుస్తుందంట జరిగే పనేనా.?

Wednesday, October 10th, 2018, 02:40:20 PM IST

నేడు తెలంగాణా రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని జరగబోయేటటువంటి సభకు బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా అంబెడ్కర్ స్టేడియంలో నిర్వహించబోయే సమరభేరి అనే భారీ బహిరంగ సభకు విచ్చేయనున్నారు ఇది అంతా బాగానే ఉంది.ఇప్పుడు జరగబోయేటటువంటి ఈ సభ ఏర్పాట్లను చూసుకుంటున్నటువంటి బీజేపీ నాయకుడు చింతల రామచంద్రా రెడ్డి కాంగ్రస్ మరియు తెరాస పార్టీల మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు,ఇప్పటికే కాంగ్రెస్ వారు తెరాస,బీజేపీ కలిసి కావాలని డ్రామాలాడుతున్నాయన్న మాటలను రామచంద్ర రెడ్డి ఆ రెండు పార్టీలు మాకు బద్ధ శత్రువులని బలంగా కాంగ్రెస్ నేతల మాటలను తిప్పి కొట్టారు.ఇది కూడా బాగానే ఉంది కానీ..

వచ్చే ఎన్నికల్లో మాత్రం తెలంగాణా రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేస్తాం అని చాలా నిక్కచ్చిగా సెలవిస్తున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ పార్టీకి అందులోను తెలంగాణలో అది సాధ్యపడుతుందా అంటే కష్టమే అని చెప్పాలి.తెలంగాణలోని తెరాస పార్టీకు ఒంటరిగా పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవమని తెలిసే బీజేపీ కన్నా బలమైన కాంగ్రస్ మరియు టీడీపీ చేతులు కలిపారు.ఈ పార్టీలతో పోలిస్తే బీజేపీ కి తెలంగాణలో ఉన్నటువంటి ఆధరణ కాస్త తక్కువే అని చెప్పాలి.అయినా వారు చాలా బలంగా బీజేపీ గెలిచేస్తుందని చెప్పేస్తున్నారు.మరి వారు ఏ ధైర్యంతో ఈ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారో వారికే తెలియాలి.ఇంకెన్నాళ్లు మరో రెండు నెలల్లో ఎవరి జాతకాలు ఏంటో వెల్లడయ్యిపోతాయి అప్పటి వరకు మనం కూడా వేచి చూద్దాం.