చంద్రబాబు మనిషా మర మనిషా అర్ధం కావట్లేదు..నీ చిల్లర రాకీయాలు మానుకో!

Friday, October 26th, 2018, 09:02:06 PM IST

చంద్రబాబు జగన్ పై జరిగిన దాడి పట్ల చేసిన వ్యాఖ్యలు పెను సంచలనానికి దారి తీశాయి ఇప్పటికే చంద్రబాబు మీద వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతే కాకుండా ఇప్పుడు చంద్రబాబుకి వ్యతిరేకంగా తెలంగాణా నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.తెరాస పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చెందిన కర్నె ప్రభాకర్ చంద్రబాబు పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్ కు మా నాయకులు ఫోన్ చేసి మాట్లాడితే మీకు అందులో ఏం తప్పు కనిపించిందో చెప్పాలి అని ప్రశ్నించారు.

అసలు చంద్రబాబు మనిషా లేక మర మనిషా అర్ధం కావట్లేదు అన్నారు.చంద్రబాబుకి ప్రతీది రాజకీయ కోణంగా మార్చుకొని ఒక మాట మాట్లాడితే రెండు ఓట్లు ఒక అడుగు వేస్తే నాలుగు ఓట్లు జనం దగ్గర నుంచి రాల్చుకోవడానికి చూస్తున్నాడని మండిపడ్డారు.వారి మంత్రి కేటీఆర్ సాటి మనిషిగా జగన్ యొక్క యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంటే దాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చెయ్యాలని చూస్తున్నారని మండి పడ్డారు.జగన్ మీద జరిగిన దాడి మీద నీ సొంత కొడుకే ఖండిస్తున్నా అని ట్విట్టర్ లో ట్వీట్ చేసాడని,అంతెందుకు నీ మంత్రులు కూడా ఈ దుశ్చర్యను ఖండిస్తున్నామని తెలిపారని ఇవన్నీ వదిలేసి విచక్షణ లేకుండా కేటీఆర్ ఎందుకు ఫోన్ చేసి మాట్లాడారు అని అడుగుతున్నారని,చంద్రబాబు ఇకనైనా తన చిల్లర రాజకీయాలు మానుకోవాలని మండిపడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments