పవన్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారైందా?

Wednesday, May 9th, 2018, 03:45:52 PM IST

రానున్న సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రజల్లోకి వెళ్లి తమ కార్యాచరణను, విధానాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఓ వైపు టిడిపి, వైసిపి కూడా తమ కార్యాచరణను రూపొందించుకుంటే, మరో వైపు జనసేన పార్టీ అధినేత పవన్ కూడా త్వరలో ప్రజల్లోకి వెళ్లేందుకు ఒక ప్రజాయాత్ర చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఎక్కడినుండి పోటీ చేస్తారు అనేదానిపై మాత్రం ఇప్పటివరకు సందిగ్ధత తొలగలేదు. మొన్నటివరకు ఆయన అనంతపురం నుండి పోటీ చేస్తారని, ఇక్కడి ప్రజల సమస్యలకు చలించిపోయిన పవన్ అక్కడినుండి పోటీ చేసి వారికి తనవంతుగా న్యాయం చేయాలనుకుంటున్నట్లు అప్పట్లో అనుకున్నారు.

అయితే నేడు పవన్ పోటీ చేసే నియోజకవర్గం పై మరొక మాట వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన కృష్ణ జిల్లా అవనిగడ్డ నుండి పోటీ చేసే ఆలోచనలో వున్నారని, ఆ జిల్లా జనసేన పార్టీ ఇంచార్జి మొత్తంశెట్టి కృష్ణ రావు అన్నారు. ఈ సందర్భంగా అక్కడి స్థానిక ఆర్య వైశ్య కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతో జిల్లాలో జనసేనను బలోపితం చేసే విధంగా అన్ని విధాలా తగు కార్యాచరణ రూపొందిస్తున్నామని, ప్రజలకు తమవంతు సాయమందించటమ్, ప్రజాభిష్టం మేరకు పాలన అందించడమే తమ పార్టీ ముఖ్యోద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం శెట్టి విజయనిర్మల సహా కొందరు స్థానిక నాయకులూ పాల్గొనున్నారు. కాగా పవన్ పోటీ చేసే విషయమై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం కాలేదని, అతిత్వరలోనే అయన తాను పోటీ చేసే నియోజకవర్గంపై ఒక ప్రకటన విడుదల చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి……

  •  
  •  
  •  
  •  

Comments