“మహర్షి”..ఈ ఒక్క విషయంలో ఏం జరుగుతుందో..?

Monday, February 11th, 2019, 08:10:37 PM IST

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం “మహర్షి”.ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే వచ్చిన రకరకాల వార్తల వలన విపరీతమైన హైప్ వచ్చింది.కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా విషయంలో ఒక అంశం మహేష్ అభిమానులను కలవరపెడుతుంది.ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే..ఆ మధ్య అంతా దేవి తన మాయాజాలంతో సంగీత ప్రియులుని ఏ రేంజ్ లో అలరించారో అందరికీ తెలిసిందే.కానీ కాలం మారుతున్న కొద్దీ దేవిశ్రీ సంగీతంలో అప్పటి మ్యాజిక్ మిస్సవుతుందని అతని అభిమానులు అంటున్నారు.

గత సినిమా “వినయ విధేయ రామ”కు ఇచ్చిన సంగీతం అయితే ఏ కోశానా కూడా ఎవరికీ ఎక్కలేదు.ఒక్క పాట మినహా మిగతా పాటలు ఏదో పర్వాలేదనిపించాయి.అంతే కాకుండా అంతకు ముందు కొన్ని సినిమాలు కూడా దేవిశ్రీ మార్క్ లో లేవు అనే చెప్పాలి.ఒక సినిమాకి సూపర్ గా ఇస్తే మరో సినిమాకి పేలవంగా ఇస్తున్నారు,దీనితో మహర్షి సినిమాకు దేవిశ్రీ ఏం చేస్తాడో అని మహేష్ అభిమానులు ఒక పక్క ఖంగారు గానే ఉన్నారట.సినిమాకి సంగీతమే ప్రాణం.అలాంటి సంగీతం విషయంలో దేవిశ్రీ ఇస్తున్న బీట్స్ ఏ మాత్రం ఫ్రెష్ గా సంగీత ప్రియులకు అనిపించట్లేదు.అందుకే ఈ సినిమాకు దేవిశ్రీ ఏం చేస్తాడో అని ఈ ఒక్క విషయంలో కాస్త ఖంగారు గానే ఉన్నారు.