షాకింగ్ : విండీస్ వన్డే సిరీస్ కు ధోని పై వేటు..!?

Thursday, October 11th, 2018, 11:00:40 AM IST

తాజాగా వెస్టిండీస్ తో జరిగినటువంటి టెస్టు మ్యాచులో కోహ్లీ సేన అద్భుత ప్రదర్శనను కనబర్చి విజయాన్ని సొంతం చేసుకుంది.అయితే ఈ నెల 21 న వెస్టిండీస్ తో జరగబోయే వన్డే మ్యాచులకు గాను భారత జట్టులో క్రీడాకారుల ఎంపికకు గాను రేపు హైదరాబాద్ లోని జట్టు ఎంపికదారులు అధికారులు సమావేశం కానున్నట్టు తెలుస్తుంది.ఈ సమావేశంలో కొన్ని తప్పని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్నటువంటి రిషబ్ పంత్ మరియు రాయుడులు జట్టులో ఉండటానికి ఎక్కువ అవకాశాలున్నాయని,ఇప్పటికే గాయంతో బాధ పడుతున్నటువంటి కేదార్ జాదవ్ కు జట్టులో చోటు దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కూడా తెలుస్తుంది,అటు బౌలర్లలో చూసుకున్నా సరే భువి మరియు భుమ్రా లను కూడా జట్టులో ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.కానీ ఒక్క ధోని విషయానికి వచ్చే సరికే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి,ఇది వరకు జరిగినటువంటి ఆసియ కప్ మ్యాచుల్లో కెప్టెన్ కూల్ పెద్ద చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమి కనబర్చలేదని జట్టు ఎంపిక అధికారులు భావించి ఈ సారికి ధోనిని ఈ వన్డే సిరీస్ కు తప్పించే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలుస్తుంది.