త్వరలో మన దేశంలో వాట్సాప్ ను బ్యాన్ చేయనున్నారా?

Wednesday, June 13th, 2018, 11:46:48 AM IST

ప్రస్తుతకాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగించని వారు దాదాపుగా చాలా అరుదు అనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా మన నిత్యావసర జీవితంలో ఇంటర్నెట్ యొక్క అవసరం ఎక్కువ కావడంతో స్మార్ట్ ఫోన్ వినియోగం కూడా పెరిగింది. అందునా సోషల్ మీడియా మాద్యమాలయిన వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి వాటిని వాడేవారు అత్యధికులు వుంటున్నారు. అయితే వీటి వాడకంవల్ల చాలా ఉపయోగాలున్నప్పటికీ, కొన్ని నష్టాలూ కూడా వున్నాయి. వీటిలో మరీ ముఖ్యంగా వాట్సాప్ ని ప్రస్తుతం కొందరు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుతున్నారు.

కొన్ని న్యూస్ లు వాట్సాప్ లో ప్రత్యక్షమవగానే, అది ఎంతవరకు నిజమో, అసలు నిజమో కాదో తెలుసుకోకుండా చాలా వరకు దానిని షేర్ చేయడం వంటివి చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. ఆ విషయం అటుంచితే, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేవారు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేవారు తమ సమాచారం అనుసంధానం కోసం వాట్సాప్ ను వినియోగిస్తున్నట్లు కేంద్ర ఇంటలిజెన్స్ శాఖ చెపుతోంది. ఇటీవల ఢిల్లీ లో కేంద్ర ఇంటలిజెన్స్ విభాగ అధికారులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులు, వివిధ పోలీస్ శాఖల ఉన్నత అధికారులు అందరు కలిసి ఏర్పాటుచేసిన ఒక సమావేశంలో సమాచార మాధ్యమాలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. అయితే అందులో వాట్సాప్ ద్వారా పంపుకునే సందేశాలు ఎండ్ టూ ఎండ్ డిస్క్రిప్షన్ ను కల్గివుండడంతో వారి సమాచారాన్ని కనుగొనడం ఇంటలిజెన్స్ విభాగాధిపతులు వీలుకావడం లేదని,

అంతేకాక ఇటీవల కాశ్మీర్ లోని మిలిటరీ ఆర్మీ క్యాంపు పై జరిగిన ఉగ్రదాడి కూడా వాట్సాప్ సందేశాల ద్వారానే సమాచార అనుసంధానం జరిగిందని వారు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల కొన్ని ప్రాచ్య దేశాల్లో వాట్సాప్ ద్వారా వాయిస్ కాలింగ్, వీడియో చల్లింగ్ వంటివి నిషేధించాలని, వీలైతే కొన్ని దేశాల్లో వాట్సాప్ ను పూర్తిగా నిషేధించడం వంటి ఆలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగానే ఉగ్రదాడులు, సామజిక విధ్వంశాలు జరగడం కనుక పెరిగితే ప్రభుత్వాలు వాట్సాప్ ను పూర్తిగా నిషేధించే అవకాశాలు కనపడుతున్నాయని సమాచారం. అయితే ఒకవేళ ఇదే గనుక జరిగితే వాట్సప్ కు చాలావరకు ఎడిక్ట్ అయిన మన ప్రజలనుండి ప్రభుత్వానికి వ్యతిరేకత ఎదురవ్వక మానదని, అందువల్ల దీనిపై ప్రభుత్వమే ఏదైనా ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకునే విధంగా ఆలోచన చేయాలనీ నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు……