గవర్నర్ నరసింహన్ ను పదవి నుండి తప్పించనున్నారా?

Wednesday, April 25th, 2018, 02:25:57 PM IST

తెలుగు రాష్ట్రాలకు గత దశాబ్ద కాలంగా గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ పదవి కాలం ప్రస్తుతం ముగియనుండంతో కేంద్రం ఆయనను ఆ పదవి నుండి తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వున్నపుడు 2009లో గవర్నర్ గా నియమితులయిన ఆయన రెండుసార్లు తన పదవి పొడిగింపు పొందరు. అయితే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పలు రకాల విమర్శలకు తావు ఇస్తుండడంతో కేంద్రం కూడా ఆయనపై సుముఖంగా లేదని, అంతేకాక యుపిఎ హయాంలో నియమితులయిన గవర్నర్లలో ఇప్పటివరకు పదవిలో కొనసాగుతోంది ఆయన ఒక్కరే. కాగా అయన తటస్థంగా వ్యవహరించడం లేదని, అంతేకాక కొన్ని రాజకీయపార్టీలకు లోబడి పని చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలవాలని ఢిల్లీ పిలిపించింది కేంద్రం.

ఈ భేటీ తర్వాత ఆయన్ని తప్పించే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు అంటున్నాయి. అంతే కాక ఆయన్ని తొలగించాలంటూ ఏపీ బిజెపి శాఖ కేంద్రానికి ప్రత్యేకంగా ఒక లేఖ రాయడం గమనార్హం. గత కొద్దికాలంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన చంద్రబాబు, కేసీఆర్ కూడా ఆయన తీరుపై సంతృప్తిగా లేరని తెలుస్తోంది. అధీకాక సుదీర్ఘంగా అదే పదవిలో కొనసాగుతున్న ఆయన్ని ఇకనైనా తప్పించి మరొకరికి అవకాశం ఇస్తే మంచిదని కేంద్రవర్గాలు కూడా భావిస్తున్నాయట. అయితే నేటి భేటీ అనంతరం ఆయన్ను అధికారికంగా మే నెలలో కానీ, లేక కర్ణాటక ఎన్నికల తర్వాత కానీ తొలగించనున్నారని సమాచారం. అయితే ఈ విషయమై కేంద్ర శాఖ నుండి అధికారిక ప్రకటన వెలువడవలసి వుంది……

  •  
  •  
  •  
  •  

Comments