నాగం చేరికతో కాంగ్రెస్ లో గ్రూప్ రాజీకీయాలు పెరిగాయా?

Thursday, April 26th, 2018, 01:05:03 PM IST

అంటే కొందరు కాంగ్రెస్ నేతలు అవుననే అంటున్నారు. ఇటీవల గత కొద్దికాలంగా బిజెపి లో వున్న నాగం, ఆపార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడంలేదని, అంతే కాక అధికార టిఆర్ఎస్ పై ఏదైనా మాట్లాడాలంటే తనకు సరైన మద్దతు లభించనందున కొన్నాళ్లుగా ఆలోచనలో పడ్డ నాగం మొత్తానికి నిన్న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అనూహ్యంగా నిన్న ఢిల్లీ లో ఏకంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అయితే నాగం ఆగమనం వల్ల పాలమూరు, మహబూబ్ నగర్ లలో కొంత ఆగమాగం అవుతుందని, అంతేకాక గ్రూప్ రాజకీయాలు మరింత పెరుగుతాయని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పటికే జైపాల్ రెడ్డి వంటి వారిని అధిష్టానం బుజ్జగించగా ఆయన మెత్తపడి ఒప్పుకున్నప్పటికీ డీకే అరుణ, నంది ఎల్లయ్య వంటి వారు మాత్రం ఆయన చేరికపై ఇంకా అయిష్టతతోనే ఉన్నట్లు చెపుతున్నారు.

ఇదివరకు నాగం టిడిపి లో వున్నపుడు ఆయనతో వాగ్వాదం కారణంగా జైలుపాలయిన కాంగ్రెస్ నేతలు కొంతమంది వున్నారని, అటువంటివారు మాత్రం ఆయన చేరికను వ్యతిరేకిస్తున్నట్లు చెపుతున్నారు. అయితే కొందరు కాంగ్రెస్ నాయకులూ మాత్రం ఆయన పార్టీలోకి వస్తే పర్లేదుకాని ముందస్తుగా ఆయనకు హామీలు ఏవి ఇవ్వవద్దనేది తమ మనవిగా అధిష్టానానికి చెప్పారట. అయితే నాగం చేరిక వెనుక కొన్న హామీలు ఉన్నాయనేది మరొక వర్గం వాదన. అయితే నిజానికి నాగం చేరిక విషయం అధిష్టానం గోప్యంగా వుంచడంపై సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు ఏఐసిసి తెలంగాణ ఇంచార్జి కుంతియా పై మండిపడ్డట్లు తెలుస్తోంది. అలా చేయడమా వాళ్ళ నేతలు, కార్యకర్తల మధ్య అగాధం ఏర్పడుతుంది తప్ప స్నేహం వుండదని ఆయన అన్నారట. ఇక టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలు చివరి వరకు నాగం చేరిక కార్యక్రమానికి ఢిల్లీ వెళతారా లేదా అనేదానిపై సస్పెన్స్ కొనసాగింది. ఆయన మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లడంలేదని,

తెలుగు సంఘాల సమావేశాల్లో పాల్గొనేందుకు బెంగళూరు వెళ్తున్నారని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. వెనువెంటనే ఆయన నిజంగానే ఢిల్లీ వెళ్తున్నారన్న వార్త మీడియా కు తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఎందుకు ఇంత గోప్యంగా ఉంచారని కొందరు కాంగ్రెస్ నేతలు తలలు పెట్టుకున్నారట. ఏది ఏమైనప్పటికీ నాగం చేరికతో కాంగ్రెస్ కు కొంత బలం వచ్చినట్లయింది అని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ కుట్రలను ఎండగడతామని, సమిష్టిగా పోరాడి, ఎలాగైనా ప్రజల మనసులో స్థానం సంపాదించి, విజయం సాధిస్తామని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి…..

  •  
  •  
  •  
  •  

Comments