వైఎస్ షర్మిళ పోటీకి అంత సిద్దమేనా…?

Saturday, January 12th, 2019, 03:21:22 AM IST

ఏపీ లో ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ అక్కడి నేతలందరూ కూడా తమ కసరత్తులు ముమ్మరం చేస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరిని బరిలోకి దింపాలా అని తల పట్టుకుంటున్నారు. కానీ తాజాగా వైస్సార్సీపీ అధ్యక్షుడికి కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వారి సొంత ప్రదేశమైన కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలా అని సతమతమవుతున్నారంట జగన్. ఎమ్మెల్యేగా ఎవరిని ప్రతిపాదించాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నారు అక్కడి నేతలు… కానీ తాజాగా అక్కడ నియోజకవర్గంలో జగన్ సోదరి అయినటువంటి షర్మిళని బరిలోకి దింపాలని అందరు నేతలు అనుకుంటున్నారట. షర్మిల అయితేనే అక్కడ విజయం సాదిస్తుందని అందరి అంచనా.

అయితే అక్కడ ఇదివరకే ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ రెడ్డి కి ఎంపీ టిక్కెటు ఇచ్చి, తన స్థానంలో షర్మిళని బరిలోకి దింపాలని చూస్తున్నారు. కానీ ఎమ్మెల్యేగా గా పోటీ చేయడానికి షర్మిళ అంత ఇష్టత చూపడం లేదని సమాచారం. కానీ షర్మిలని ఎమ్మెల్యే గా కంటే, ఎంపీ గా నిలబెట్టడమే శ్రేయస్కారం అని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఇప్పుడే అక్కడ ఎం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. చూద్దాం ఈసారి జమ్మలమడుగు నియోజక వర్గంలో వైస్సార్సీపీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఎవరిని వరిస్తుందో చూద్దాం…