పవన్ లేకే ఓటమా..?

Tuesday, September 16th, 2014, 05:20:40 PM IST


సార్వత్రిక ఎన్నికలలో హాల్ చల్ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.జగ్గారెడ్డి బీజేపి లో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నాడని చెప్పి.. జగ్గారెడ్డిని బీజేపిలో చేర్పించేందుకు తెరవేనుకనుంచి చాలా ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది.. అంతేకాకుండా.. జగ్గారెడ్డిని హడావుడిగా మెదక్ పార్లమెంట్ అభ్యర్ధిగా ప్రకటించడం కూడా ఇటువంటి సందేహాలకు తావునిచ్చింది. ఇదిలా ఉంటే.. జగ్గారెడ్డి మొదటి నుంచి సమైక్యవాది అని… ఇప్పుడు బీజేపి సమైక్యవాదికి టిక్కెట్ ఇచ్చి బరిలోకి దించుతున్నదని.. జగ్గారెడ్డికి ఓటు వేస్తె.. సమైక్యానికి ఓటు వేసినట్టే అని తెరాస పార్టీ ప్రచారం చేసింది. తెరాస ఈ విధంగా ప్రచారం చేయడానికి కారణాలు లేకపోలేదు.. పవన్ కళ్యాణ్ అంటే మొదటి నుంచి తెరాస నాయకులకు పాడనీ విషయం తెలిసిందే.. దీన్నే ఆయుధంగా చేసుకొని.. తెరాస ప్రచారం చేసింది..

జగ్గారెడ్డి..ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు పవన్ కళ్యాణ్ ను ప్రచారానికి తెచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తున్నది. కాని, వివిధ కారణాల వలన మెదక్ ప్రచారానికి రాలేకపోయినట్టు తెలుస్తున్నది. ఒకవేళ పవన్ కనుక ప్రచారానికి వచ్చివుంటే.. ఫలితాలు మరో రకంగా ఉండేవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయిన పవన్ లేకుండానే ప్రచారం ముగిసినపుడే జగ్గారెడ్డి ఓటమి ఖాయమని తేలిపోయింది..