జనసేన కార్యకర్తలు ఆ తప్పు చేస్తున్నారా..?

Friday, September 7th, 2018, 01:38:49 AM IST

పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం అని పార్టీ పెట్టి ఇక ఆంధ్ర రాష్ట్రం లో కొత్త రాజకీయ ప్రక్షాళన జరగాల్సిందే అని కొత్త నాయకత్వం కొత్త ప్రభుత్వం రావాల్సిందే అని తనకి అధికారం మీద వ్యామోహం లేదంటూనే ఇక తప్పదు అంటూ అధికారం చేజిక్కించుకోడం కోసం బరిలో దిగారు జనసేన అధ్యక్షుడు “పవన్ కళ్యాణ్”. ఐతే అటు ఉత్తరాంధ్ర నుంచి తన ప్రజా పోరాట యాత్ర మొదలు పెట్టి గోదావరి జిల్లాల వరకు వచ్చారు. ఐతే పవన్ కళ్యాణ్ వరకు ఆయన తన పార్టీని బలోపేతంగా నిర్మించుకుంటూ వెళ్తున్నారు అన్నది విదితమే. అదే సందర్భం లో పవన్ కళ్యాణ్ ప్రీ మానిఫెస్టోని కూడా విడుదల చేశారు. ఇందులోని అంశాలను పూర్తిగా ఆంద్ర రాష్ట్రం అంతటా జనం లోకి పవన్ కళ్యాణ్ ఒక్కరే తీసుకెళ్ళలేరు. దీనికి సమిష్టి కృషి కావాలి. అది జనం లోకి వారి కార్యకర్తలు బలంగా తీసుకెళ్తున్నారా అంటే కొన్ని చోట్ల మినహాయించి మిగతా ప్రాంతాలలో గ్రామాల్లో తీసుకెళ్లటం లేదు అనే మాటే ఎక్కువగా వినిపిస్తుంది.

ముఖ్యంగా జనసేన ప్రీ మ్యానిఫెస్టోలో అన్నిటిని మించి రెండు అంశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు, ఒకటి ఉచిత గ్యాస్ సిలిండరు మరియు రేషన్ కు బదులుగా వాటి స్థానం లో నగదు బదిలీ పథకాన్ని జనసేనాని అమలులోకి తీసుకు వచ్చారు. అయితే ఈ పథకాలు ఎంత బాగున్నప్పటికీ ఈ విషయం సామాన్య ప్రజానీకం లోకి వెళ్ళటం లేదు అనే మాటలే ఎక్కువ వినిపిస్తున్నాయి. వీటిని బలంగా సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లాసిన భాద్యత ఇప్పుడు జనసేన కార్యకర్తల్లో ఉన్నది అని రాజకీయ విశ్లేషకులు విశ్వసిస్తున్నారు.. ఈ పథకాల్ని ముఖ్యంగా మహిళల్లోకి తీసుకెళ్తే జనసేన పార్టీ కి మహిళా ఓట్లు అధిక మొత్తం లో దొరికే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ సమయంలో జనసేన అభిమానులు కార్యకర్తలు వారి పార్టీ పట్ల ఎలాంటి అశ్రద్ధ వహించకూడదని వారి యొక్క సిద్ధాంతాలని మ్యానిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఇప్పటి నుంచే మొదలు పెట్టాలని రాజకీయ విశ్లేశకులు భావిస్తున్నారు. ఆలా ఐతే జనసేన పార్టీ కి రాబోయే కాలం లో ఇంకా ఎక్కువ ఆదరణ లభిస్తుంది అని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments