అమెరికాకు ఇండియా తాక‌ట్టు నిజ‌మా?

Tuesday, October 31st, 2017, 12:36:35 PM IST

న‌ల్ల‌ధ‌నం నివార‌ణే ల‌క్ష్యంగా పెద్ద నోట్ల ర‌ద్దు చేప‌ట్టారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. అయితే ర‌ద్దు వ‌ల్ల న‌ల్ల డ‌బ్బు నివార‌ణ జ‌ర‌గ‌క‌పోగా, ల‌క్ష‌ల కోట్ల బ్లాక్‌మ‌నీ వైట్‌గా మారింద‌ని ప‌లు స‌ర్వేలు వెల్ల‌డించాయి. అనుకున్న ల‌క్ష్యం పూర్తిగా నీరుగారింద‌ని ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అంతేకాదు.. భార‌త్ డిజిట‌ల్ లావాదేవీల‌కు అల‌వాటు ప‌డితే, దాని లాభాలు అమెరికా బ‌హుళ జాతి కంపెనీల‌కు వెళ్లిపోతాయ‌ని, బ‌ల‌వంతంగా డిజిట‌ల్ లావాదేవీల వైపు మ‌ళ్లించ‌డానికి కార‌ణ‌మిదేన‌న్న విశ్లేష‌ణ‌లు వెలువ‌డ్డాయి. న‌రేంద్ర మోదీ- మాజీ అమెరికా అధ్య‌క్షుడు ఒబామా మ‌ధ్య ఓ భారీ ఒప్పందం జ‌రిగింది. అమెరికాకు చెందిన ప‌లు బ‌హుళ జాతి కంపెనీలు లాభ‌ప‌డే ఒప్పంద‌మిది. ఓ ర‌కంగా మోదీ .. అమెరికాకు ఇండియాని తాక‌ట్టు పెట్టేశాడ‌ని సాక్ష్యాలు చూపిస్తూ ప‌లు జాతీయ‌, తెలుగు మీడియాలు క‌థ‌నాలు వెలువ‌రించాయి. 15 ల‌క్ష‌ల కోట్లు .. మేర పెద్ద నోట్లను ఆర్బీఐ వెన‌క్కి తీసుకుంటే.. డిజిట‌ల్ లావాదేవీలే ల‌క్ష్యంగా ర‌ద్దైన నోట్ల స్థానంలో కొత్త నోట్ల‌ను బ్యాంకుల‌కు పంపించ‌కుండా ప్రింటు ఆపేశార‌ని .. ఇది పెద్ద కుట్ర అని చెప్పుకున్నారు. 225 కోట్ల జ‌నం నెత్తిన డిజిట‌ల్ పోటు ఇద‌ని పేర్కొన్నారు. ఆర్బీఐ గ‌త గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్ వ్య‌వ‌స్థ‌ను ప్లాన్ చేస్తే, మోదీ న‌ల్ల‌ధ‌నం ముసుగులో నోట్ల‌ను ర‌ద్దు చేశారుట‌. డిజిటల్ ల‌వాదేవీల వైపు బ‌ల‌వంతంగా అడుగులేయించడం అమెరిక‌న్ కంపెనీల కుట్ర అని ప‌లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

వీసా, మాష్ట‌ర్ కార్డ్స్ వ‌గైరా కార్డులు స‌హా ప‌దుల సంఖ్య‌లో ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ‌ల లాభాల కోసం దేశ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల్ని మోదీ తాక‌ట్టు పెట్టార‌ని ప‌లు క‌థ‌నాలు వెల్ల‌డించాయి. ప్ర‌తి ఒక్క భారతీయుడి ఆన్‌లైన్ ట్రాన్జాక్ష‌న్ నుంచి స‌ర్ ఛార్జులు విదేశీ కంపెనీల‌కు వెళ్లిపోతాయి. అవేవీ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థకు బ‌లాన్ని ఇవ్వ‌వ‌ని క‌థ‌నాలు వెల్ల‌డించాయి. ఉదాహ‌ర‌ణ‌కు.. రూ.2 టాక్స్ క‌లుపుకుని, ఒక 500 నోటు.. 500 మంది చేతులు మారితే రూ. 1000 అద‌నంగా ట్రాన్జాక్ష‌న్ జ‌రిగిన‌ట్టు. ఇందులోంచి సింహ భాగం విదేశీ కంపెనీల చేతిలోకి వెళుతుందని పేర్కొంటున్నాయి. అయితే ఈ క‌థ‌నాలు ఇంట్రెస్టింగ్.. కానీ ఇందులో వాస్త‌వ‌మెంత‌? అన్నది సామాన్యుడికి అర్థం కాని ఓ ఫ‌జిల్‌. చూద్దాం.. మునుముందు ఇలాంటి క‌థ‌నాల‌కు అర్థ‌వంత‌మైన వివ‌ర‌ణ‌లు మీడియా ఇస్తుందేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments