పవన్ కి మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువయ్యిపోతుందా..?

Tuesday, November 6th, 2018, 06:19:59 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు.సినిమా జీవితాన్ని వదిలేసి గత కొద్ది నెలలు నుంచి పూర్తిగా తన శైలిలో రాజకీయాలు మొదలు పెట్టారు.2014 లోనే పార్టీ పెట్టినా సరే తన వృత్తి రీత్యా సినిమాలు చేసుకుంటూనే రాజకీయాలు చేసుకునేవారు.ప్రశ్నించడానికే తాను పార్టీని వ్యవస్థాపించాను అన్న స్థాయి నుంచి ఇప్పుడు పాలించడానికి కూడా తాను సిద్ధమే అనే సంకేతాలు కూడా ఇస్తున్నారు.అయితే మొదటి నుంచి పదవి మీద ఎలాంటి ఆశలు లేవని చెప్పుకునే పవన్ గత కొద్ది రోజులు నుంచి మీరు నేను సీఎం కావాలి అని కోరుకుంటే అవుతానని చెప్పుకుంటూ వస్తున్నారు.

అదే సందర్భంలో వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అటు తెలుగుదేశం పార్టీని కానీ ఇటు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని గాని గెలవనివ్వనని కొన్ని సంకీర్ణ పరిస్థితులు వల్ల జనసేన పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుంది అని పవన్ ఈ మధ్య గట్టిగా చెప్తున్నారు.అయితే ఎన్నికల ప్రచారం బాగానే చేసుకుంటున్నారు కానీ వారి పార్టీకి సంబంధించి ఇంకా అభ్యర్థులను పూర్తిగా ప్రకటించలేదు,వచ్చే ఎన్నికల్లో తానే సీఎం కాబోతున్నానని పరోక్షంగా పవనే చెప్పుకుంటున్నారు,ఈ సూచనలు అన్ని చూసుకుంటే పవన్ యొక్క తీరులో ఈ మధ్య గట్టి మార్పే వచ్చినట్టు తెలుస్తుంది,ఇది నమ్మకమో లేక అతి నమ్మకమో పవన్ కే తెలియాలి.

  •  
  •  
  •  
  •  

Comments