షాకింగ్ : చింతమనేని విషయంలో పవన్ చెప్పిందే జరుగుతుందా..?

Saturday, November 17th, 2018, 06:24:29 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లకు మధ్య జరిగిన మాటల దాడి ఎంత సంచలనానికి దారి తీసిందో అందరికి తెలుసు.అయితే ఇప్పుడు చింతమనేని ఎదుర్కుంటున్న పరిస్థితులను గమనిస్తే అప్పుడు పవన్ చెప్పినదే జరుగుతుందా అన్న అనుమానం కలుగుతుంది.ఎందుకంటే పవన్ దగ్గరకి చింతమనేని బాధితులు వచ్చినపుడు పవన్ ముందు కాస్త సున్నితంగానే వార్నింగ్ ఇచ్చారు.

చింతమనేని యొక్క వైఖరిని మార్చుకోవాలి అని,లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని,ఇకనైనా అతని యొక్క ప్రవర్తనలో గాని మార్పు రాకపోతే క్షేత్ర స్థాయిలో తిరగబడతారని హెచ్చరించారు.అయినా సరే చింతమనేని తన వైఖరిని మార్చుకోలేదు అదే పంథాని ఇప్పటి వరకు కొనసాగించారు.చింతమనేని మీద కులం పేరుతో వ్యక్తులను దూషిస్తాడని ఒక ఆరోపణ ఉంది ఆ మాటలను నిజం చేస్తూనే ఈ రోజు వేంపాడులోని రంగారావు అనే వ్యక్తిని దూషించి కొట్టారు.కట్ చేస్తే సీన్ మొత్తం రివర్స్ అయ్యిపోయింది అప్పుడు పవన్ అన్నట్టుగానే అక్కడి ప్రజలు తిరగబడ్డారు.దానితో ఇక చేసేది ఏమి లేక చింతమనేని వారికి క్షమాపణ చెప్పవలసి వచ్చింది.ఇకనైనా చింతమనేని ప్రభాకర్ తన వైఖరిని మార్చుకుంటారో లేదో చూడాలి.