“లక్ష్మిస్ ఎన్టీఆర్” లో వర్మ టార్గెట్ చంద్రబాబేనా?..డూప్ బాబుతో ఆల్రెడీ మాట్లాడేసా.!

Wednesday, October 24th, 2018, 07:25:28 PM IST

ఇప్పటికే “విశ్వవిఖ్యాత నట సార్వ భౌమ నందమూరి తారక రామారావు” గారి జీవిత చరిత్ర మీద దర్శకుడు క్రిష్ నందమూరి బాలకృష్ణ తో “యన్.టీ.ఆర్” అనే చిత్రాన్ని ప్రకటించారు.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఆ చిత్రం ప్రస్తుతం అంతిమ దశకు చేరుకుంది.అయితే ఈ సమయంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను తీసేటువంటి “లక్ష్మిస్ ఎన్టీఆర్” లో మాత్రం ఎవరు చూపించని భయంకరమైన నిజాలను నా చిత్రంలో చూపిస్తానని బాంబు పేల్చారు.స్వర్గంలో ఉన్నటువంటి అన్నగారి యొక్క పవిత్ర ఆత్మకు కూడా తాను తీసిన సినిమా మాత్రమే నచ్చుతుందని ఛాలెంజ్ కూడా చేశారు.

అయితే ఇప్పుడు ఈ చిత్రం తాను చూపిస్తానన్నటువంటి భయంకరమైన నిజాలలో చంద్రబాబు నాయుడు యొక్క పాత్ర కూడా ఒక కీలక పాత్ర పోషించనుంది అన్నటుగా సంకేతాలు వదులుతున్నారు.తాను తన ట్విట్టర్ ఖాతా ద్వారా అన్నగారు మరియు బాబు గారు ఉన్నటువంటి ఫోటోలు పెట్టడం చంద్రబాబు లా అచ్చు గుద్దినట్టు ఉన్న మనిషి యొక్క వైరల్ వీడియోని షేర్ చెయ్యడం మరియు తన యూట్యూబ్ ఛానెల్లో పెట్టినటువంటి ఒక వీడియోలో కూడా చంద్రబాబు ఫోటోలని ఎక్కువ గుర్తించేలా పెట్టడం ఇవన్నీ చూస్తుంటే ఈ చిత్రంలో బాబు గారి పాత్ర మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.అయితే చంద్రబాబు డూప్ పాత్రకి ఇప్పటికే ఆ వీడియోలో ఉన్న వ్యక్తితో మాట్లాడానని,ఇప్పటికే నాలుగైదుగురుని ఎంచుకున్నానని వారిలో ఎవరొకరిని బాబు పాత్రకి త్వరలోనే ఖాయం చేస్తానని తెలిపారు.