సొంత పార్టీ నేత‌లే ఉప్పందించారా?

Sunday, October 14th, 2018, 11:56:32 AM IST

టీడీపీ నేత సీఎం ర‌మేష్ అన‌తి కాలంలోనే వేల కోట్ల‌కు అధిప‌తిగా మారిన వైనం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఆయ‌న‌కు సంబంధించిన కార్యాల‌యాలు, నివాసాలు, బంధువుల ఇళ్ల‌పై ఏక కాలంలో ఐటీ దాడులు జ‌రిగాయి. దీని వెనుక రాజ‌కీయాంగా క‌క్ష సాధింపులో భాగంగానే కేంద్రంలో వున్న బీజేపీ ఈ దాడుల‌కు పూనుకుంద‌ని టీడీపీ శ్రేణులు బాహాటంగానే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. అయితే ఈ ఐటీ దాడుల వెనుక వేరే వ్య‌క్తుల హ‌స్తం వుంద‌ని మ‌రో వాద‌న వినిపిస్తోంది. పార్టీలో సీఎం ర‌మేష్ ఎదుగుద‌ల‌ను, ఆధిప‌త్యానన్ని స‌హించ‌లేని పార్టీ వ్య‌క్తులే సీఎం ర‌మేష్ ఆస్తుల‌పై ఉప్పందించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

త‌న సొంత జిల్లా అయిన క‌డ‌ప నియోజ‌క వ‌ర్గాల‌నికి చెందిన వ‌ర‌ద‌రాజులు రెడ్డి కి సీఎం ర‌మేష్‌కు గ‌త కొంత కాలంగా వ‌ర్గ పోరు న‌డుస్తోంది. ఏ విష‌యంలోనూ ఇద్ద‌రికి పొస‌గ‌డం లేదు. అత‌ని కాంట్రాక్టుల‌కు స‌కాలంలో బిల్లు రాకుండా సీఎం ర‌మేష్ చ‌క్రం తిప్పుతున్నాడ‌ని, వ‌ర‌ద‌రాజులును ఎలాగైనా ఆర్థ‌కంగా దెబ్బ‌కొట్టాల‌ని ప్లాన్‌లు వేసేవాడ‌ని సొంత పార్టీ నేత‌లే చెబుతున్నారు. దీంతో విసిగిపోయిన వ‌ర‌ద‌రాజులు సీఎం ర‌మేష్ అక్ర‌మాస్తుల‌పై గొంతువిప్పేవ‌డ‌ని వినిపిస్తోంది.

దీనికి తోడు టీడీపీ సీనియ‌ర్ నేత‌లు కూడా సీఎం ర‌మేష్ వ్య‌వ‌హార శైలికి విసిగిపోయిన‌ట్లు చెబుతున్నారు. చంద్ర‌బాబు మెప్పుకోసం డ‌బ్బును పెట్టుబ‌డిగా పెట్టి బ‌డా కాంట్రాక్టుల్ని సీఎం ర‌మేష్ అలోక‌గా త‌న్నుకుపోవ‌డం…చంద్ర‌బాబును కాక ప‌ట్ట‌డం కూడా సీనియ‌ర్‌ల‌కు ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంద‌ట‌. ఈ కార‌ణంగానే సీఎం ర‌మేష్ ఆస్త‌ల గురించి ఐటీ శాఖ‌కు ఉప్పందించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా వుంటే సీఎం ర‌మేష్ అక్ర‌మాస్తుల‌పై హైకోర్టులో కేసువేశారు. 2003లో 61 కోట్లు వున్న అత‌ని కంపెనీ ఆదాయం 2009రు 488కోట్ల‌కు పెర‌గ‌డం అప్ప‌ట్లోనే వైఎస్ విజ‌య‌మ్మ అనుమానాలు వ్య‌క్తం చేశారు. తాజాగా ఐటీ విచార‌ణ‌లో సీఎం ర‌మేష్ గుట్టంతా బ‌య‌ట‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.