షాకింగ్ : జగన్ ని చంపడానికి ముందే ట్రైనింగ్..?

Friday, November 9th, 2018, 02:46:07 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పై శ్రీనివాసరావు అనే యువకుడు కోడి పందాలకు వాడే కత్తిని వినియోగించి హత్యాయత్నంకు పాల్పడిన సంగతి తెలిసినదే.ఈ చర్య తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించేసింది.దాడికి పాల్పడిన యువకుని మీద ఇప్పటికే అనేక రకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి.విచారణ చేపట్టిన సిట్ బృందం మాత్రం ఇప్పటివరకు అతని దగ్గర నుంచి నిజం ఏమిటి అనేది మాత్రం రాబట్టలేక తలలు పట్టుకుంటున్నారు.

అయితే కొంత మంది తల పండిన పోలీసు అధికారులు మాత్రం జగన్ మీద హత్యా ప్రయత్నం చెయ్యడానికి పాల్పడిన యువకుడు ఇది వరకే ఈ తరహా హత్యలు చేసేటటువంటి గ్యాంగ్ ల దగ్గర శిక్షణ తీసుకుని ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే జగన్ మీద జరిగినటువంటి దాడి ఏమి చిన్నది కాదని,ఎంతో మంది కరుడుకట్టిన హంతకులు ఎన్నో హత్యలకు ఇలాంటి చిన్నపాటి ఆయుధాలు ఉపయోగించే మనిషి శరీరాలల్లో కొన్ని సున్నితమైన చోట్ల గాయపరుస్తారని,దాని వల్ల గాయం తగిలింది అని తెలిసే లోపే ప్రాణాపాయ స్థితికి ఆ మనిషి వెళ్ళిపోతాడని అభిప్రాయపడుతున్నారు.ఇప్పుడు అలాంటి గ్యాంగ్ దగ్గరే ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి ట్రైనింగ్ తీసుకొని జగన్ మీద దాడి చేసి ఉంటాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.